News December 22, 2024
ప్రజలపై ‘చంద్ర’బాదుడు: వైసీపీ నేతలు

AP: అధికారంలోకి వచ్చిన తర్వాత CM చంద్రబాబు హామీలను గాలికొదిలేశారని YCP నేతలు జోగి రమేశ్, మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ నెల 27న YCP పోరుబాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోయలేక ప్రజలు అల్లాడుతున్నారు. SC, STలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు మంగళం పలికారు. ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదు. చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతాం’ అని వారు మండిపడ్డారు.
Similar News
News December 8, 2025
అఖండ-2 రిలీజ్ ఎప్పుడు?

అఖండ-2 సినిమా కొత్త రిలీజ్ డేట్‌పై నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై బాలకృష్ణ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. DEC 12న ఎట్టిపరిస్థితుల్లోనూ మూవీ విడుదల చేయాల్సిందేనని SMలో డిమాండ్ చేస్తున్నారు. #WeWantAkhanda2OnDec12th హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కొందరైతే నిర్మాతలకు వార్నింగ్ ఇస్తున్నారు. కాగా ఈ శుక్రవారమే రిలీజ్ ఉండే అవకాశం ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
News December 8, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు బీజేపీ మద్దతు

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్‌కు మద్దతిస్తున్నట్లు BJP రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తోంది. తెలంగాణకు కూడా పూర్తి అండగా ఉంటుంది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారు. సమ్మిట్ విజయవంతమై రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.
News December 7, 2025
బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ అరెస్టయ్యారు. బయోపిక్ తీస్తామని రాజస్థాన్ డాక్టర్‌ను రూ.30 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలతో విక్రమ్‌తో పాటు ఆయన భార్య శ్వేతాంబరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రమ్ కూతురు కృష్ణతో సహా 8 మందిపై FIR నమోదు చేశారు. రేపు విక్రమ్ దంపతులను రిమాండ్‌కు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజ్, హేట్ స్టోరీ, 1920, ఘోస్ట్, ఫుట్ పాత్ తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.


