News April 4, 2024
ఈ దుస్థితికి చంద్రబాబే కారణం: సజ్జల

AP: వాలంటీర్లపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘వాలంటీర్ వ్యవస్థపై నిమ్మగడ్డ రమేశ్‌తో ఫిర్యాదు చేయించారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి వాలంటీర్లకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన వల్ల వృద్ధులు ఎండలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రోజూ ఏదోక కారణంతో TDP నేతలు ECకి ఫిర్యాదులు చేస్తున్నారు’ అని ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.
Similar News
News April 13, 2026
పెద్దపల్లి: ఈనెల 14న వీ హబ్ ప్రారంభం

ఏప్రిల్ 14న రంగంపల్లిలో నిర్మించిన వీ హబ్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఈ కేంద్రం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకొని సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు సైతం సాఫ్ట్ స్కిల్స్, ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారని వివరించారు.
News April 13, 2026
అక్కడ గర్భం దాల్చాకే పెళ్లికి గ్రీన్ సిగ్నల్!

TN నీలగిరి కొండల్లోని ‘తోడా తెగ’ వింత ఆచారాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక్కడ ఒకే కుటుంబంలోని సోదరులను పెళ్లాడే ‘బహుభర్తృత్వం’ సంప్రదాయం ఉండేది. యువకులు 100 కిలోల రాయిని ఎత్తి తమ పౌరుషాన్ని నిరూపించుకొని అమ్మాయిని మెప్పించాలి. పెళ్లయిన 6 నెలల తర్వాత గర్భం దాల్చాకే ‘విల్లు-అంబు’ ఉత్సవంతో ఆ వివాహానికి అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(45/100)
News April 13, 2026
నేపాల్ మంత్రులందరూ విద్యావంతులే.. మన దగ్గర సాధ్యమేనా?

నేపాల్ కొత్త మంత్రివర్గంపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త మంత్రుల్లో ఒక్కరు తప్ప అందరి వయసు 50 కంటే తక్కువే కావడం, అందరూ ఉన్నత విద్యావంతులే అవడాన్ని పలువురు అభినందిస్తున్నారు. మన నాయకులు కూడా ఇలా ఆలోచిస్తారా? డబ్బు, కులం లేకుండా మంత్రి పదవులు కేటాయిస్తారా? అని ప్రశ్నలు వేస్తున్నారు. మరి అది సాధ్యమేనా? COMMENT.


