News February 24, 2025
అసెంబ్లీకి చేరుకున్న చంద్రబాబు, జగన్

AP: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సభకు హాజరయ్యారు. కాసేపట్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. చాలా రోజుల తర్వాత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతుండటంతో ఆసక్తి నెలకొంది.
Similar News
News November 21, 2025
ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

AP: రాష్ట్రంలో మావో అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్, మరో 51 మంది మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విజయవాడ పరిసరాల్లో మరింత మంది మావోలు ఉండొచ్చనే సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
News November 21, 2025
మిస్ యూనివర్స్-2025 ఫాతిమా బాష్ గురించి తెలుసా?

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్-2025 పోటీల్లో “ఫాతిమా బాష్” విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. మెక్సికోలోని శాంటియాగో డి తెపా ప్రాంతానికి చెందిన ఫాతిమా ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. స్కూల్‌లో చదువుతున్నప్పుడు డిస్లెక్సియా, హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడిన ఆమె వాటిని దాటుకొని అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా 121 దేశాల అందగత్తెలను దాటి మిస్ యూనివర్స్‌గా నిలిచారు.
News November 21, 2025
పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఇదే: వైద్యులు

పిల్లల్ని కనడానికి ఏ వయసు ఉత్తమమో వైద్యులు సూచించారు. ‘ఆరోగ్యకరమైన గర్భధారణ, బిడ్డ కోసం స్త్రీల ఏజ్ 20-30 మధ్య ఉండాలి. 35 తర్వాత గర్భధారణ డౌన్ సిండ్రోమ్, బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు పెరుగుతాయి. పురుషులకు 25-35 ఏళ్లు ఉత్తమం. 40ఏళ్ల తర్వాత పుట్టేబిడ్డల్లో ఆటిజం, జన్యు సమస్యల ప్రమాదం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఏజ్ 35 కంటే తక్కువ ఉన్నప్పుడే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి’ అని చెబుతున్నారు.


