News December 16, 2024

నాగబాబు ప్రమాణస్వీకార తేదీపై చంద్రబాబు, పవన్ చర్చ!

image

AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సచివాలయంలో సమావేశమైన వీరిద్దరూ నాగబాబు మంత్రి పదవి, ప్రమాణ స్వీకార తేదీపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నామినేట్ పదవుల తుది జాబితా, ఇతర అంశాలపైనా చర్చించనున్నట్లు సమాచారం. చంద్రబాబు, పవన్ భేటీ ముగిసిన తర్వాత నాగబాబు ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Similar News

News December 12, 2025

రోజూ 2 లీటర్లకు పైగా పాలు.. ఇదే ఈ మేక స్పెషల్

image

సాధారణంగా ఒక మేక రోజుకు 500ml నుంచి లీటర్ వరకు పాలు ఇస్తాయి. కానీ బీటల్ జాతి మేకలు మాత్రం రోజూ 2 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని గురుదాస్‌పూర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో స్వచ్ఛమైన బీటల్ జాతి మేకలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని పాలు, మాంసం ఉత్పత్తి కోసం పెంచుతారు. పెద్ద శరీర పరిమాణం, చెవులు చదునుగా, పొడవుగా, వంకర్లు తిరిగి 15 సెంటీమీటర్ల పైనే ఉంటాయి.

News December 12, 2025

అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం

image

AP: అల్లూరి(D)లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా ప్రమాదంలో 15 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు భద్రాచలంలో దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

News December 12, 2025

నేడు అనఘాష్టమి వ్రతం ఆచరిస్తున్నారా?

image

మార్గశిర బహుళ అష్టమి అయిన నేడు అనఘాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. దత్తాత్రేయుడి రూపమైన అనఘ స్వామిని, ఆయన అర్ధాంగి అనఘా దేవిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. అష్టసిద్ధులు గల సంతానం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలని సూచిస్తున్నారు. ఈ పూజను రాముడు, ధర్మరాజు చేశారని నమ్మకం. అనఘాష్టమి పూజ ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.