News June 28, 2024
త్వరలో ఒకే వేదికపైకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి

AP, TG CMలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తొలిసారి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. జులై 3వ వారంలో HYDలోని HICCలో జరిగే ప్రపంచ కమ్మ మహాసభ కార్యక్రమంలో CMలు పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో TDPలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రేవంత్ ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్లో చేరి తెలంగాణ CM అయ్యారు. చాలాకాలం తర్వాత ఇరువురిని ఒకే వేదికపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News November 2, 2025
ఏపీ రౌండప్

* పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు రెండేళ్ల సర్వీసును ఏడాదికి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
* పంట నష్టం అంచనాల నమోదుకు గడువును ఈ నెల 7 వరకు పెంచాలని కౌలురైతు సంఘం డిమాండ్
* సమ్మె కాలాన్ని పనిరోజులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరిన ఏపీ పీహెచ్సీ ఉద్యోగుల సంఘం
* పన్నులు తగ్గినా రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. గత అక్టోబర్తో పోలిస్తే 8.77శాతం వృద్ధి
News November 2, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలోనూ చికెన్ ధరలు తగ్గట్లేదు. హైదరాబాద్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.210-250, కామారెడ్డిలో రూ.260, ఉమ్మడి ఖమ్మంలో రూ.210-240, విజయవాడలో రూ.250, ఏలూరులో రూ.220, విశాఖలో రూ.260గా ఉన్నాయి. కార్తీక మాసం అయినప్పటికీ ఆదివారం కావడంతో పలు ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. మీ ఏరియాలో రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.
News November 2, 2025
ఎగిరే కారు తెస్తున్నా: ఎలాన్ మస్క్

అసాధ్యాలను సాధ్యం చేసే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చేశారు. తమ కంపెనీ నుంచి గాల్లో ఎగిరే కారును తెస్తున్నట్లు ఓ పాడ్కాస్ట్లో వివరించారు. ఈ ఏడాదిలోనే దానికి సంబంధించిన ప్రొటో టైప్ను ప్రదర్శిస్తామన్నారు. అయితే ఆ కారుకు రెక్కలుంటాయా? హెలికాప్టర్లా ఎగురుతుందా? అనే పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. తమ ఆవిష్కరణ ఊహలకు అందని విధంగా ఉంటుందని మాత్రం మస్క్ స్పష్టం చేశారు.


