News January 5, 2025
రాజీవ్ బాటను చంద్రబాబు, YS కొనసాగించారు: రేవంత్
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి ఐటీని పరిచయం చేశారని CM రేవంత్ అన్నారు. రాజీవ్ వేసిన బాటను చంద్రబాబు, YS కొనసాగించారని తెలిపారు. ఐటీ, ఫార్మాలో తెలుగువారి గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు. చంద్రబాబు ఐటీకి పెద్దపీట వేసి సైబరాబాద్ నిర్మిస్తే, వైఎస్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం విమానాశ్రయం సమీపంలో ఫోర్త్ సిటీ నిర్మిస్తుందని తెలుగు సమాఖ్య మహాసభల్లో వివరించారు.
Similar News
News January 7, 2025
KTR అరెస్ట్ తప్పదా? ఈనెల 9న ఏం జరగనుంది?
TG: ఫార్ములా-ఈ రేసుకు సంబంధించి ఏసీబీ కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. మరోవైపు ఈనెల 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా?ఆయనను అధికారులు అరెస్ట్ చేస్తారా? అనేది జనాల్లో చర్చనీయాంశంగా మారింది.
News January 7, 2025
ఆస్కార్ బరిలో ‘కంగువా’, ‘ది గోట్ లైఫ్’
తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ ఆస్కార్ బరిలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆస్కార్ 2025 పోటీలో నిలిచిన సినిమాల లిస్ట్ రిలీజవగా ఇందులో ‘కంగువా’ చోటు దక్కించుకుంది. దీంతోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ కూడా ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకోవడం విశేషం. అయితే, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిన ‘కంగువా’ ఆస్కార్ బరిలో ఉండటం ఏంటని కొందరు విమర్శలు చేస్తున్నారు.
News January 7, 2025
కోటి ఎకరాలకు ‘రైతు భరోసా’?
TG: ఈనెల 26 నుంచి ‘రైతు భరోసా’ సాయాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. యాసంగి సీజన్కు సంబంధించి ఎకరానికి ₹6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తున్న నేపథ్యంలో దాదాపు కోటి ఎకరాలకు ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంది. అంటే ₹5,500 కోట్ల నుంచి ₹6,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. గత ప్రభుత్వం 1.52 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని అందించింది.