News June 11, 2024
CMగా చంద్రబాబు.. మంత్రులు ఎవరు?

AP: రేపు చంద్రబాబుతో పాటు మంత్రులుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీ నుంచి ఎవరికి చోటు దక్కుతుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సామాజిక సమీకరణాలు, సీనియర్లలో ఎవరిని అవకాశం వరిస్తుందనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అటు పవన్కు DY.CMతో పాటు ఎలాంటి శాఖలు దక్కుతాయనే దానిపై జనసైనికుల్లో చర్చ నెలకొంది. మీ జిల్లా నుంచి ఎవరికి పదవి దక్కుతుందో కామెంట్ చేయండి.
Similar News
News November 16, 2025
అంబేడ్కర్ ప్రసంగం కంఠోపాఠం కావాలి: సీజేఐ

AP: రాజ్యాంగాన్ని దేశానికి అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం లాయర్లకు కంఠోపాఠం కావాలని CJI జస్టిస్ బీఆర్ గవాయ్ చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా మంగళగిరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఓ స్థిరపత్రంగా చూడకుండా సవరణ విధానాలనూ పొందుపరిచారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కునూ కల్పించారు’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
BREAKING: భారత్ ఓటమి

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో భారత్కు ఊహించని షాక్ ఎదురైంది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలైంది. టీమ్ ఇండియా 93 పరుగులకే పరిమితమైంది. దీంతో RSA 30 పరుగుల తేడాతో గెలిచింది. సుందర్ 31, అక్షర్ 26, జడేజా 16 రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మెడనొప్పితో గిల్ సెకండ్ ఇన్నింగ్సులో బ్యాటింగ్కు రాలేదు. SA బౌలర్లలో హార్మర్ 4, జాన్సెన్ 3 వికెట్లతో సత్తా చాటారు.
News November 16, 2025
2028 నాటికి చంద్రయాన్-4 పూర్తి: నారాయణన్

ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 7 ప్రయోగాలు చేయనున్నట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీటిలో PSLV, గగన్యాన్ మిషన్లతోపాటు ఓ కమర్షియల్ శాటిలైట్ ప్రయోగమూ ఉందని చెప్పారు. ‘చంద్రయాన్-4కు కేంద్రం ఆమోదం తెలిపింది. 2028 నాటికి చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకురావడమే దీని లక్ష్యం. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తిచేస్తాం’ అని వివరించారు.


