News July 18, 2024
ఎంపీడీవో మిస్సింగ్‌పై చంద్రబాబు ఆరా

AP: నరసాపురం MPDO <<13649438>>వెంకటరమణారావు <<>>కుటుంబ సభ్యులకు CM చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. రమణారావు చివరిగా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు? ఆయన ఒత్తిడికి గురవ్వడానికి గల కారాణాలేంటి? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ విషయాల్లో ఇబ్బంది పడ్డారని ఆయన సతీమణి తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరపాలని కలెక్టర్‌ను CM ఆదేశించారు. కాగా గత 4 రోజులుగా ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Similar News
News December 15, 2025
నేడు సర్వ ఏకాదశి.. మోక్షం కోసం ఏం చేయాలంటే?

మార్గశిర కృష్ణ పక్ష ఏకాదశినే సర్వ ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువును ఆరాధించాలని పండితులు సూచిస్తున్నారు. తద్వారా మోక్షం లభిస్తుందని చెబుతున్నారు. ‘దానాలు చేయడం వల్ల ఆత్మ శుద్ధి జరుగుతుంది. చేసే పనుల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. తృణధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం పాటించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. వ్రతాలు ఆచరించడం మరింత శ్రేయస్కరం. మనస్ఫూర్తితో విష్ణుమూర్తిని ఆరాధిస్తే ముక్తి లభిస్తుంది’ అంటున్నారు.
News December 15, 2025
రెండో విడతలోనూ కాంగ్రెస్‌దే హవా

TG: రెండో విడత GP ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే హవా కొనసాగింది. మొత్తం 4,331 స్థానాల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని 2,300కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 1,100+, బీజేపీ 250+, ఇతరులు 480+ స్థానాల్లో గెలుపొందారు. మొత్తం 46.7 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోగా అత్యధికంగా భువనగిరి(91.2%), అత్యల్పంగా నిజామాబాద్(76.71%)లో పోలింగ్ నమోదైంది.
News December 15, 2025
కుంకుమ మన బలాన్ని పెంచుతుందా?

ఆలయాల ప్రాంగణంలో ప్రాణ శక్తికి సంబంధించిన పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రసరిస్తూ ఉంటాయి. ఈ ప్రకంపనలను కొన్ని వస్తువులు మాత్రమే గ్రహించగలవు. అందులో ‘కుంకుమ’ కూడా ఒకటి. ఇది గుడి పరిసరాల్లో ప్రసరిస్తున్న ఆ గాలిలోని ప్రాణశక్తిని గ్రహించి మన శరీరానికి పంపుతుంది. తద్వారా మన శరీరంలో శక్తి ప్రవాహం పెరుగుతుంది. మొత్తంగా కుంకుమ దేవాలయ సానుకూల శక్తిని మనలోకి తీసుకువస్తుంది.


