News July 7, 2024
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ఆరా

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై CM రేవంత్‌తో భేటీలో చంద్రబాబు ఆరా తీశారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి తెలంగాణ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, తలసరి ఆదాయం ఎలా పెరుగుతూ వచ్చింది? అనే అంశాలను తెలుసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 6 గ్యారంటీలపై ఎలా ముందుకెళ్తున్నారన్న విషయాలను బాబు ప్రస్తావించారు. APలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నందున తెలంగాణ అనుభవాలను CBN తెలుసుకున్నారు.
Similar News
News February 4, 2026
ఢిల్లీలో కలకలం: 15 రోజుల్లో 807 మంది అదృశ్యం

దేశ రాజధాని ఢిల్లీలో 15 రోజుల్లో ఏకంగా 807 మంది అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. JAN 1-15 మధ్య మహిళలు, బాలికలు 509 మంది, 298 మంది పురుషులు కనిపించకుండా పోయినట్లు కేసులు నమోదయ్యాయి. వీరిలో 196 మంది మైనర్లుండగా వారిలో 146మంది బాలికలే. 2025లో ఢిల్లీలో మొత్తం 24,508 మంది తప్పిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. అందులో 14,870 మంది మహిళలున్నారు. 15,421 మంది ఆచూకీ తెలియగా మిగతా వారి జాడ ఇప్పటికీ తేలలేదు.
News February 4, 2026
పదిలమైన ఇంటికి పంచ సూత్రాలు

ఇల్లు పదిలంగా ఉండేందుకు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు ‘పంచసూత్రాలు’ సూచిస్తున్నారు. అవి 1. సరైన వాస్తుతో స్థలం ఎంపిక, 2. పనుల నిర్వహణకు పక్కా ప్లానింగ్, 3. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే బలమైన స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, 4. అవసరాలకు అనుగుణంగా వస్తువుల అమరిక తెలిపే ఇంటీరియర్ డిజైన్, 5. ఇంటి అందాన్ని పెంచే ఇంటీరియర్ డెకరేషన్. ఈ 5 అంశాల మేళవింపుతోనే ఇల్లు సేఫ్, అందంగా ఉంటుందని ఆయన అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 4, 2026
పవన్‌ను కలిసిన రాజేంద్ర ప్రసాద్

AP: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇవాళ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్‌ను పవన్ అభినందించారు.


