News November 3, 2024

గజినీలా ప్రవర్తిస్తోన్న చంద్రబాబు: వాలంటీర్లు

image

AP: తమకు ఇచ్చిన హామీలను మరచిపోయి సీఎం చంద్రబాబు గజినీలా వ్యవహరిస్తున్నారని వాలంటీర్లు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తోందని ఆరోపించారు. తమ గౌరవ వేతనం రూ.10 వేలను ఎప్పుడు ఇస్తారని చంద్రబాబు, పవన్‌ను వారు ప్రశ్నించారు. తాము మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News February 2, 2026

టూరిస్ట్ స్పాట్‌గా డంప్‌యార్డ్.. ఎలా మారింది?

image

రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ డంపింగ్ యార్డ్ ఇప్పుడు SMలో సెన్సేషన్‌గా మారింది. ‘రాజస్థాన్ స్విట్జర్లాండ్’గా పిలిచే ఈ ప్రాంతం నిజానికి మార్బుల్ వ్యర్థాల డంప్‌యార్డ్. మార్బుల్ కటింగ్ నుంచి వచ్చే తెల్లటి పౌడర్ కొండల్లా పేరుకుపోయి వర్షపు నీరు చేరడంతో అచ్చం మంచు కొండల మధ్య నీటి సరస్సులా కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఇన్‌స్టా రీల్స్, సినిమా షూటింగ్స్‌కి అడ్డాగా మారింది. ఈ డస్ట్ ఆరోగ్యానికి ప్రమాదకరం.

News February 2, 2026

ఫైనల్లో భారత్ ఎదురైతే.. పాక్‌కు మాజీల ప్రశ్న!

image

T20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడకూడదన్న పాక్ నిర్ణయాన్ని ఆ దేశ మాజీ ప్లేయర్లే విమర్శిస్తున్నారు. ‘ఫస్ట్ మ్యాచ్ బాయ్‌కాట్ సరే.. మరి ఫైనల్లో భారత్ ఎదురైతే అప్పుడు ఆడకుండానే కప్పు వారికిచ్చేస్తారా?’ అని దానిశ్ కనేరియా ప్రశ్నించారు. ఇది పాక్ భయపడుతోందనే సంకేతం ఇస్తుందని విమర్శించారు. మరోవైపు ‘క్రికెట్ ద్వారా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని, భారత్‌తో ఆడకపోవడం బాధాకరమని అఫ్రీది అభిప్రాయపడ్డారు.

News February 2, 2026

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ తప్పదు: సజ్జల

image

AP: రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, బందిపోట్ల మాదిరి TDP తమ నేతల ఇళ్లపై దాడులు చేస్తోందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్‌ల ఆదేశాలతో అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై పోలీసుల సమక్షంలోనే గూండాలు దాడి చేశారని పేర్కొన్నారు. లడ్డూ అంశంలో దొరికిపోవడంతో CBN ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక CBNకి రిటర్న్ గిఫ్ట్ తప్పని సరిగా ఇస్తామని హెచ్చరించారు.