News September 27, 2024
చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు: జగన్

AP: తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ CM చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని జగన్ విమర్శించారు. ‘రాజకీయ దుర్బుద్ధితోనే లడ్డూ విశిష్టతను CM దెబ్బతీశారు. 100 రోజుల పాలనను డైవర్ట్ చేయడానికి లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారు. జంతువుల కొవ్వు కలిసిందని భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసేందుకు డిక్లరేషన్ అంశం తీసుకొచ్చారు. మాజీ CMకు దేవుడిని దర్శించుకునే హక్కు లేదా?’ అని ప్రశ్నించారు.
Similar News
News November 27, 2025
సిద్దిపేట: యువకుడి సూసైడ్.. ముగ్గురిపై కేసు

ప్రేమించిన యువతి దక్కడం లేదని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. వర్గల్ మం. అంబర్పేట వాసి పవన్ కళ్యాణ్(21), ఓ యువతి ప్రేమించుకున్నారు. వాళ్ల పెళ్లికి పెద్దలు నిరాకరించారు. ఇంటికి వెళ్లిన పవన్పై యువతి తండ్రి శ్రీనివాస్, మహేష్, తిరుపతి కలిసి దాడి చేశారు. దీంతో గడ్డి మందు తాగిన పవన్ చికిత్స పొందుతూ ఈనెల 25 మృతి చెందాడు. ఈ ఘటనలో ముగ్గురిని రిమాండ్ చేశారు.
News November 27, 2025
రాజ్యాంగంలోని ప్రాథమిక విధులివే..

ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్న పౌరులు విధులనూ నిర్వర్తించాలని రాజ్యాంగదినోత్సవంలో నాయకులంతా పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు క్లుప్తంగా.. రాజ్యాంగ సంస్థలు, పతాకం, గీతం, సమరయోధులు, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా ఉండాలి. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. పిల్లలకు విద్యను అందించాలి.
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.


