News July 2, 2024
పెన్షన్ పెంపులో జగన్‌కి చంద్రబాబు సాటిరారు: YCP

పెన్షన్ పంపిణీ, పెంపు విషయంలో YS జగన్‌కి చంద్రబాబు ఎప్పటికీ సాటిరారని టీడీపీకి వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ‘మాటలు నేర్చిన కుక్క.. ఉస్కో అంటే డిస్కో అన్నదట. అలా ఉంది TDP తీరు. గడప వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది YS జగనే. ఇది ఒప్పుకునే ధైర్యం లేకనే ఫేక్ అంటూ తప్పించుకుంటున్నావ్!’ అని ట్వీట్‌లో పేర్కొంది.
Similar News
News March 11, 2026
IPL వాయిదా పడుతుందా?

MAR 28 నుంచి ప్రారంభం కావాల్సిన IPL యుద్ధంతో వాయిదా పడుతుందా? అనే సందేహం నెలకొంది. ఆటగాళ్లకు హోటళ్లలో గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ ఆలస్యమైంది. ఇక విమాన సర్వీసుల్లో అంతరాయం వల్ల ఫారిన్ ప్లేయర్లు రావడంపైనా అనుమానాలున్నాయి. టోర్నీ ప్రారంభం నాటికి పరిస్థితులు అదుపులోకి రాకపోతే ప్రత్యామ్నాయాలు వెతుకుతాం అని IPL ఛైర్మన్ చెప్పారు.
News March 11, 2026
రోజూ 8-10 లీటర్ల పాలిచ్చే ఆవుకు ఎంత మేత ఇవ్వాలి?

సంకర జాతి పశువులకు వాటి పాల ఉత్పత్తిని బట్టి దాణాను అందించాలని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. రోజుకు 8 నుంచి 10 లీటర్ల పాలిచ్చే సంకరజాతి ఆవుకు ఈత ఈనిన తర్వాత లేదా పాలిచ్చే రోజుల్లో రోజుకు 20-30 కేజీల పచ్చగడ్డి, 4-5 కేజీల ఎండుగడ్డి, 4 నుంచి 4.5 కిలోల దాణా మిశ్రమం ఇవ్వాలి. అలాగే ఇదే పశువు వట్టిపోయిన సమయంలో రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 6-7 కేజీల ఎండుగడ్డి, 0.5-1 కేజీ దాణా మిశ్రమం ఇవ్వాలి.
News March 11, 2026
GAILలో 70 పోస్టులు.. మార్చి 18 చివరి తేదీ

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL)లో 70 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. BE/BTech,ME/MTech అర్హతగల వారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.60,000-రూ.1,80,000 చెల్లిస్తారు. GATE-2026 స్కోరు, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ, అసెస్‌మెంట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: gailonline.com


