News December 31, 2024
ఇస్రోకి చంద్రబాబు అభినందనలు

PSLV-60 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రోకు AP CM చంద్రబాబు ట్విటర్లో అభినందనలు తెలిపారు. ‘మరో మైలురాయిని దాటిన ఇస్రోకు అభినందనలు. ఆర్బిటల్ డాకింగ్‌లో భారత సామర్థ్యాన్ని మరింత పెంచేలా స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమైంది. మనుషుల రోదసి ప్రయాణానికి, ఉపగ్రహాలు మరమ్మతులకు ఇది చాలా కీలకం. ఈ విజయంతో చంద్రయాన్-4, స్పేస్ స్టేషన్ వంటి కీలక లక్ష్యాలకు భారత్ మరింత చేరువైంది’ అని పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
రూ.485కే 72 రోజుల ప్లాన్

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా 72 రోజుల స్మార్ట్ సేవింగ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.485తో రీఛార్జ్ చేస్తే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 2GB డేటా, 100 SMSలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇదే తరహా ప్లాన్లు మిగతా టెలికాం కంపెనీల్లో దాదాపు రూ.700-800 రేంజ్‌లో ఉన్నాయి.
News November 23, 2025
TG న్యూస్ అప్డేట్స్

* ఫార్ములా-ఈ కార్ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం. ఈ భయంతోనే ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రూ.5 లక్షల కోట్ల భూస్కామ్ అంటున్న కేటీఆర్ అందుకు ఆధారాలుంటే బయటపెట్టాలి: మంత్రి అడ్లూరి
* డీసీసీ పదవుల నియామకంలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. 17 పదవులను బీసీలకే ఇచ్చాం. కాంగ్రెస్ చేపట్టిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దేశ చరిత్రలో నిలిచిపోతుంది: మహేశ్ కుమార్ గౌడ్
News November 23, 2025
రేపు ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన రోడ్డు మార్గంలో ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వెళ్తారు. అక్కడ కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.


