News July 6, 2024
కేంద్రాన్ని ₹లక్ష కోట్లు డిమాండ్ చేసిన చంద్రబాబు?
ఎన్డీఏలో కీలకంగా మారిన CM చంద్రబాబు కేంద్రం ముందు పలు డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. అమరావతి నిర్మాణం, ఇతర కీలక ప్రాజెక్టులు, పథకాల అమలు కోసం ₹లక్ష కోట్లకుపైగా నిధులను కోరినట్లు ఎకనామిక్ టైమ్స్, బ్లూమ్‌బర్గ్ వెల్లడించాయి. కేంద్ర బడ్జెట్లో ఈ కేటాయింపులు చేయాలని PMపై ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నాయి. ముఖ్యంగా రాజధానికి ₹50వేల కోట్లు, పోలవరానికి ₹12వేల కోట్లు, ఆర్థిక లోటు భర్తీకి ₹7వేల కోట్లు కోరారట.
Similar News
News January 17, 2025
8th పే కమిషన్.. భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు!
8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2016లో 7th పే కమిషన్ ఏర్పాటుచేయగా, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. దీంతో బేసిక్ శాలరీ ₹7K నుంచి ₹18Kకు పెరిగింది. ఇప్పుడు 8వ కమిషన్‌లో ఫిట్మెంట్ 2.86 ఉంటుందని, బేసిక్ జీతం ₹51,480కి పెరుగుతుందని నిపుణుల అంచనా. కనీస పెన్షన్ ₹9K నుంచి ₹20+Kకి పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు.
News January 17, 2025
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ హామీని కేంద్రం నిలబెట్టుకుంది: రామ్మోహన్
విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదాన్ని కేంద్రం కాపాడిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు డైరెక్ట్ ఈక్విటీ కింద రూ.10,300Cr, షేర్ క్యాపిటల్ కింద రూ.1,140Cr బదిలీ చేసేలా కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. దీంతో ప్లాంట్ పరిరక్షణకు ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయని పేర్కొన్నారు.
News January 17, 2025
ఏపీ ప్రజలు గర్వించే విషయమిది: సీఎం చంద్రబాబు
AP: స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయమని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈమేరకు ఆయన ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు అంటే పరిశ్రమ మాత్రమే కాదని, దీనికి ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు.