News June 22, 2024
YCP ఎమ్మెల్యేలు వేడుకుంటే జగన్‌కు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు: TDP

AP: అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్‌ను అగౌరవపరిచారంటూ తమ పత్రికలో వార్త రాయించిన భారతిరెడ్డి ఇప్పటికైనా చెత్త రాతలు ఆపాలని TDP ట్వీట్ చేసింది. ‘మీ భర్త ప్రతిపక్ష నేత హోదానీ ప్రజలు పీకేశారు. ఇప్పుడు అతను 175 మందిలో ఒక సాధారణ MLA. మా సైకో తట్టుకోలేడని మీ YCP MLAలు వేడుకుంటే మంత్రుల తర్వాత చంద్రబాబు అవకాశం ఇచ్చారు. లేదంటే అక్షర క్రమంలో మీ పులివెందుల MLA చిట్టచివర ప్రమాణం చేసేవాడు’ అని కౌంటర్ ఇచ్చింది.
Similar News
News December 3, 2025
పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
News December 3, 2025
విశాఖలో 12 నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు

AP: ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖలో ఈ నెల 12 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ఐటీ పార్కులోని తాత్కాలిక భవనంలో తన సెంటర్ ఏర్పాటు చేయనుంది. అదే రోజు కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 2028 జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తవుతాయని సమాచారం.
News December 3, 2025
పెళ్లి కాని వారు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవచ్చా?

పెళ్లికాని వారు కూడా సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిరభ్యంతరంగా ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. సాయంత్రం వేళలో చేసే ఈ వ్రతానికి అధిక ఫలితం ఉంటుందని అంటున్నారు. ‘ఈ వ్రతాన్ని ఇంట్లోనే కాకుండా ఆలయాలు, నదీ తీరాలు, సాగర సంగమాల వద్ద కూడా చేసుకోవచ్చు. స్వామివారి కథ విన్నా కూడా శుభం జరుగుతుంది. ఇంట్లో ఏదైనా అశుభం జరిగినప్పుడు, సూతకం వంటివి ఉన్నప్పుడు వ్రతాన్ని చేయకపోవడం మంచిది’ అంటున్నారు.


