News March 22, 2024
తెలంగాణ వ్యక్తికి MP టికెట్ ఇచ్చిన చంద్రబాబు

AP: టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు బాపట్ల (SC) ఎంపీ టికెట్ కేటాయించారు. 1960లో HYDలో జన్మించిన ఈయన NIT వరంగల్, అహ్మదాబాద్ IIMలో చదివారు. 1984లో IPSగా ఎంపికై.. మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలపడంలో కీలకపాత్ర పోషించారు. విజయవాడ సీపీగా పని చేశారు. ఈయన కొద్ది రోజుల క్రితం వరంగల్ BJP ఎంపీ టికెట్ ఆశించారు.
Similar News
News October 28, 2025
మరోసారి బాలకృష్ణకు జోడీగా నయనతార?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నయనతార హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం అవుతుందని సమాచారం. గతంలో బాలకృష్ణ, నయనతార కాంబోలో సింహా, శ్రీరామరాజ్యం సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.
News October 28, 2025
మానవులకు బాధలెందుకు కలుగుతాయి?

మానవులకు సుఖదుఃఖాలు కలగడానికి ముఖ్య కారణం మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. మనం చేసే పనుల మీద, మనం చూసే, వినే, తినే విషయాల మీద మనకు ఇష్టం లేదా అయిష్టం అనే భావాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఒక విషయం నచ్చితే ఆనందం కలుగుతుంది. లేకపోతే బాధ కలుగుతుంది. ఈ విధంగా మన ఇష్టాలు, అయిష్టాల (రాగద్వేషాల) కారణంగానే మనుషులకు సుఖాలు, దుఃఖాలు కలుగుతాయి. ఈ రెండింటిని దాటితేనే శాంతి చేకూరుతుంది. <<-se>>#WhoIsGod<<>>
News October 28, 2025
అమెజాన్‌లో 30వేల ఉద్యోగాల తొలగింపు?

అమెజాన్ కంపెనీ 30వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఇవాళ్టి నుంచి లేఆఫ్స్‌ను ప్రకటించే అవకాశం ఉందని పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కార్పొరేట్ వర్క్ ఫోర్స్ నుంచి ఈ తొలగింపులు ఉండనున్నట్లు పేర్కొన్నాయి. వరల్డ్ వైడ్‌గా అమెజాన్ 1.54 మిలియన్ ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో కార్పొరేట్ ఎంప్లాయిస్ 3,50,000 మంది ఉంటారని అంచనా.


