News September 17, 2024
పేద విద్యార్థుల ‘డాక్టర్’ కలను చంద్రబాబు చెరిపేశారు: వైసీపీ

AP: NEET స్కోర్ 600 దాటిన విద్యార్థులకూ కన్వీనర్ కోటా తొలి కౌన్సెలింగ్‌లో మెడికల్ సీటు దక్కలేదని YCP ట్వీట్ చేసింది. ‘పేద విద్యార్థుల ‘డాక్టర్’ కలను చంద్రబాబు చెరిపేశారు. జగన్ ప్రభుత్వంలో 5 కొత్త మెడికల్ కాలేజీల ద్వారా 750 సీట్లు అదనంగా రావడంతో గతేడాది 563 స్కోర్‌కే MBBS సీటు వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నిర్వాకంతో కొత్త కాలేజీలు ఆగిపోయి, మంచి ర్యాంకు సాధించినా సీటు రావట్లేదు’ అని పేర్కొంది.
Similar News
News November 20, 2025
స్కాలర్షిప్ బకాయిల విడుదలకు ఆదేశం

TG: ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్‌లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2,813 కాలేజీలకు సంబంధించి రూ.161 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటిని వెంటనే విడుదల చేయాలని భట్టి ఆదేశించారు.
News November 20, 2025
అందుకే రూపాయి పతనమైంది: RBI గవర్నర్

డాలర్‌కు డిమాండ్ పెరగడం వలనే రూపాయి పతనమైందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. రూపాయి విలువను నిర్దిష్టంగా లెక్కించడం లేదని స్పష్టం చేశారు. అమెరికన్ కరెన్సీకి విలువ పెరగడం వల్లే రూపాయి విలువ తగ్గిందన్నారు. మార్కెట్ ఎలా జరుగుతోంది అనే దానిపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని చెప్పారు. డాలర్‌కు డిమాండ్ పెరిగితే రూపాయి విలువ తగ్గినట్టే, రూపాయి డిమాండ్ పెరిగితే డాలర్ పతనమవుతుందని తెలిపారు.
News November 20, 2025
ఓట్ చోర్, SIRపై సందేహాలను నివృత్తి చేయాలి: మాజీ సీఈసీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్, SIR ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌పై ఉందని మాజీ సీఈసీ ఖురేషి తెలిపారు. ఆరోపణలపై పూర్తి స్థాయిలో నివృత్తి చేసి ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాన్ని కాపాడాలని కోరారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, ప్రత్యారోపణలు చేయడం సరైనది కాదని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. 2010-12 మధ్య ఖురేషీ సీఈసీగా పని చేశారు.


