News July 6, 2024
చంద్రబాబు వల్ల ఏపీకి రూ.లక్షన్నర కోట్లకు పైగా నష్టం: YCP

AP: చంద్రబాబు 2015లో ఓటుకు నోటు కేసుతో దొరికిపోవడం వల్ల ఏపీ రూ.లక్షన్నర కోట్లకు పైగా నష్టపోయిందని YCP ఆరోపించింది. ‘ఈ కేసు వల్ల HYD నుంచి చంద్రబాబు పారిపోయి రావాల్సి వచ్చింది. ఏపీకి రావాల్సిన షెడ్యూల్ 9, 10 సంస్థల విషయం తేలకుండానే వచ్చేశారు. దీంతో షెడ్యూల్ 9, 10కి సంబంధించిన సంస్థల ఆస్తులు, విభజన చట్టంలో లేని ఆస్తుల పంపకంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది’ అని ట్వీట్ చేసింది.
Similar News
News December 4, 2025
ఒక్క వ్యక్తి ఆధారంగా రిజర్వేషన్.. ఎన్నిక బహిష్కరణ

TG: STలే లేని పంచాయతీకి ST రిజర్వేషన్ ప్రకటించడంతో నల్గొండ(D) అనుముల(M) పేరూరు గ్రామస్థులు సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. గతంలో పేరూరు, వీర్లగడ్డ తండా కలిపి ఉమ్మడి పంచాయతీగా ఉండేవి. తరువాత రెండూ విడిపోయాయి. ఆ సమయంలో తప్పుగా నమోదైన ఒకే ఒక్క ఎస్టీ వ్యక్తిని ఆధారంగా తీసుకుని పేరూరు రిజర్వేషన్ కేటాయించారు. ST అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేదు. దీనిపై గ్రామస్థులు HCని ఆశ్రయించారు.
News December 4, 2025
వైసీపీ వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యం: నారాయణ

AP: వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ విమర్శించారు. బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించే నాటికి వర్షాలు ముంచెత్తాయని చెప్పారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో రెండో విడత భూసమీకరణపై గ్రామస్థులతో సమావేశమయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని పేర్కొన్నారు.
News December 4, 2025
ENCOUNTER: 19కి చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన <<18460138>>ఎన్కౌంటర్లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 19 మంది మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో PLGA-2 కమాండర్ వెల్లా మోడియం కూడా ఉన్నారు. భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు ఎదురుకాల్పుల్లో నిన్న ముగ్గురు పోలీసులు మరణించిన విషయం తెలిసిందే.


