News September 18, 2024
చంద్రబాబుకి భయం లేదు: పవన్ కళ్యాణ్

AP: చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం సంతోషంగా ఉందని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అన్నారు. NDA శాసనసభా పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘CM చంద్రబాబు దార్శనికుడు. ఆయనకు భయం లేదు. ముందుచూపు ఆలోచనలతో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఎన్ని అవమానాలకు గురి చేసినా అధైర్యపడలేదు. CBNను జైలులో ఉంచినప్పుడు షూటింగ్ చేయలేకపోయా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్లు పెంచాం. 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చాం’ అని తెలిపారు.
Similar News
News November 28, 2025
నాన్-ఏసీ కోచ్ల్లోనూ దుప్పటి, దిండు

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.
News November 28, 2025
హైదరాబాదీ బిర్యానీ.. వరల్డ్లో బెస్ట్!

భారతీయులు ఇష్టపడే వంటకాల్లో ఒకటైన హైదరాబాదీ బిర్యానీ ప్రపంచ గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన ‘వరల్డ్ బెస్ట్ రైస్ డిషెస్’ లిస్టులో HYD బిర్యానీ 10వ స్థానంలో నిలిచింది. టాప్-50లో ఇండియా నుంచి ఉన్న ఏకైక వంటకం ఇదే కావడం విశేషం. కాగా తొలి మూడు స్థానాల్లో జపాన్ వంటకాలైన ‘నెగిటోరో డాన్’, ‘సుశి’, ‘కైసెండన్’ ఉన్నాయి. ప్రపంచమే మెచ్చిన HYD బిర్యానీ మీకూ ఇష్టమా?COMMENT
News November 28, 2025
RECORD: ఎకరం రూ.151.25 కోట్లు

HYD: కోకాపేట-నియోపొలిస్ లేఅవుట్లో HMDA నిర్వహించిన భూముల వేలం మరోసారి రికార్డులు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు GHR సంస్థ దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 16లో ఎకరం రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ సొంతం చేసుకుంది. మొత్తం 9.06 ఎకరాలకు వేలం వేయగా ప్రభుత్వానికి రూ.1353 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత వారం ఇదే లేఅవుట్లో ఎకరం <<18376950>>రూ.137.25 కోట్లు<<>> పలికింది.


