News September 27, 2024
చంద్రబాబూ.. మీ హయాంలో రూ.276కే నెయ్యి ఎలా కొన్నారు?: జగన్

AP: నందిని నెయ్యిని YCP హయాంలో కొనుగోలు చేయలేదని, మిగతా కంపెనీల నెయ్యిని తక్కువ ధరకు కొన్నారని చంద్రబాబు చేసిన విమర్శలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. ‘CBN హయాంలో 2015-2018 మధ్య నందిని బ్రాండ్‌ను ఎందుకు కొనుగోలు చేయలేదు? 2015లో కేజీ నెయ్యి ధర రూ.276, 2019లో రూ.324కు కొన్నారు. మా హయాంలో రూ.320కి కొంటే తప్పేముంది? ఇప్పుడు హెరిటేజ్ ధరలు పెంచుకోవడానికి CBN ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Similar News
News February 27, 2025
గుడ్లు తినేవారు ఈ తప్పులు చేస్తున్నారా?

గుడ్లు అంటే చాలామందికి ఇష్టం. వాటిని వండేటప్పుడు, తినేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. గుడ్లను అతిగా ఉడికిస్తే పోషకాలు తగ్గిపోతాయి. 20 నిమిషాలపాటు ఉడికించాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న గుడ్లు తినకూడదు. దానిలో ఉండే రుచి తగ్గిపోతుంది. గుడ్లను నేరుగా పాన్ లేదా వంటపాత్రలో పగలగొట్టకూడదు. గుడ్డు పెంకుపై ఉండే బ్యాక్టీరియా వీటిలోకి చేరుతుంది. వేరే పాత్రలో ఫిల్టర్ చేశాకే ఉపయోగించాలి.
News February 27, 2025
దేశంలోనే తొలిసారి పిల్లులకు బర్డ్ ఫ్లూ!

కోళ్లకు బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న వేళ మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో దేశంలోనే తొలిసారి ఓ పెంపుడు పిల్లిలో ఈ H5N1 వైరస్ బయటపడింది. దీంతో మనుషులకూ సోకే అవకాశం ఉందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. కరోనా మాదిరిగానే ఈ వైరస్ ఆకృతి మార్చుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రాణాంతకం కాదంటున్నారు. కాగా అమెరికా సహా పలు దేశాల్లో జంతువులు, మనుషులకూ ఈ వైరస్ సోకింది.
News February 27, 2025
అప్పుడు స్పందించకుండా ఇప్పుడు రాజకీయామా?: ఉత్తమ్

TG: SLBC ప్రమాదంపై BRS నేతల విమర్శలపై మంత్రి ఉత్తమ్ ఘాటుగా స్పందించారు. ‘శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు చనిపోతే, కాళేశ్వరం కూలి ఆరుగురు, పాలమూరు పంప్‌హౌస్‌లో ప్రమాదంలో ఆరుగురు చనిపోయినా వెళ్లలేదు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోతే KCR కదల్లేదు. మాజీ సీఎం ఫామ్‌హౌస్ దగ్గర్లోని మాసాయిపేట రైలు ప్రమాదంలో చిన్నారులు చనిపోతే స్పందించకుండా ఇప్పుడు రాజకీయమా?’ అని ధ్వజమెత్తారు.