News November 28, 2024
శ్రీ శేషాచల లింగేశ్వరుడి సేవలో చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి చిత్తూరు జిల్లాలోని శేషాపురంలో ఉన్న శ్రీ శేషాచల లింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. హీరో నారా రోహిత్ కూడా చంద్రబాబు వెంట ఉన్నారు. కాగా ఇవాళ నారావారిపల్లెలో చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి పెద్ద కర్మ జరిగింది. అనంతరం వీరు లింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
Similar News
News November 21, 2025
7 సినిమాలు.. అనుపమ అరుదైన ఘనత

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అరుదైన ఘనత సాధించారు. ఈ ఏడాది ఆమె 3 భాషల్లో నటించిన 6 చిత్రాలు విడుదలవగా DEC 5న ‘లాక్డౌన్’ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ తరం కథానాయికల్లో ఈ ఫీట్ సాధించిన తొలి దక్షిణాది నటిగా నిలిచారు. అనుపమ నటించిన డ్రాగన్, బైసన్, కిష్కింధపురి మంచి విజయాలు సాధించగా, పరదా, జానకిvsస్టేట్ ఆఫ్ కేరళ, పెట్ డిటెక్టివ్ ఫర్వాలేదనిపించాయి. ఆమె తెలుగులో శర్వానంద్ సరసన భోగి మూవీలోనూ నటిస్తున్నారు.
News November 21, 2025
బిహార్ ఎన్నికలపై ఆరోపణలు.. ECI వివరణ ఇవ్వాలని డిమాండ్!

బిహార్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ లెక్కలు సరిపోలడం లేదని పొలిటికల్ ఎకనామిస్ట్ పి.ప్రభాకర్ ఆరోపించారు. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్లో 1,77,673 ఓట్లు ఎక్కువగా వచ్చాయని Xలో <
News November 21, 2025
హనుమాన్ చాలీసా భావం – 16

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజ పద దీన్హా ||
హనుమంతుడు నిస్సహాయ స్థితిలో ఉన్న సుగ్రీవునికి గొప్ప ఉపకారం చేశాడు. అతనికి శ్రీరాముడిని పరిచయం చేసి, ఆ మైత్రి ద్వారా కోల్పోయిన రాజ్యపదవిని తిరిగి ఇప్పించాడు. సమయస్ఫూర్తితో, సరైన మార్గదర్శకత్వంతో, నిస్వార్థ స్నేహ బంధాన్ని ఏర్పరచి ధర్మ సంస్థాపనకు తోడ్పడ్డాడు. ఆపదలో ఉన్నవారికి సాయపడే ఆంజనేయుడి నిరతి అందరికీ ఆదర్శం. <<-se>>#HANUMANCHALISA<<>>


