News August 28, 2025
మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు: జగన్

AP: ఉచిత బస్సు ప్రయాణం విషయంలో చంద్రబాబు మహిళలను వెన్నుపోటు పొడిచారని YS జగన్ ఆరోపించారు. ‘11,256 ఆర్టీసీ బస్సుల్లో కేవలం 6,700 బస్సుల్లోనే ఉచిత ప్రయాణమా? అమ్మఒడి తొలి ఏడాది ఇవ్వలేదు. 87 లక్షల మంది పిల్లల్లో 30 లక్షల మందికి ఇవ్వడం లేదు. మహిళలకు మేం ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. ఉచిత సిలిండర్ల పథకానికి ₹4,100 కోట్లు అవసరమైతే ₹747 కోట్లే ఇచ్చారు. బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ’ అని Xలో జగన్ ఫైరయ్యారు.
Similar News
News August 29, 2025
నవంబర్ 15లోగా MSME పార్కులు ఏర్పాటు కావాలి: CBN

AP: రాష్ట్రంలో ఏరో స్పేస్, IT, ఫుడ్ ప్రాసెసింగ్, MSME రంగాల్లో చేపడుతున్న ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావాలని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ₹53,922 కోట్లు ఇన్వెస్ట్ చేసే 30 ప్రాజెక్టులను సీఎం ఆధ్వర్యంలోని పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(SIPB) ఆమోదించింది. అన్ని నియోజకవర్గాల్లో నవంబర్ 15లోగా MSME పార్కులు ఏర్పాటు కావాలని CM ఆదేశించారు. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
News August 29, 2025
క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ప్లేయర్లు

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో వరల్డ్ నం.2 వాంగ్(చైనా)పై సింధు వరుస సెట్లలో 21-19, 21-15 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. మెన్స్ డబుల్స్‌లో చిరాగ్, సాత్విక్ ద్వయం చైనా జోడీ లియాంగ్, వాంగ్ చాంగ్‌పై జయకేతనం ఎగురవేశారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్, తనీశా క్వార్టర్స్ దూసుకెళ్లారు. మరోవైపు రౌండ్-2లోనే లక్ష్యసేన్ పోరు ముగిసింది.
News August 29, 2025
క్రీడా ప్రపంచానికే హైదరాబాద్ వేదిక కావాలి: రేవంత్

తెలంగాణకు ఐటీ సంస్కృతి ఉన్నట్లుగానే క్రీడా సంస్కృతి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదిక కావాలని స్పోర్ట్స్ హబ్ బోర్డ్ <<17546114>>సమావేశంలో<<>> అన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తాము క్రీడా రంగానికి బడ్జెట్ 16 రెట్లు పెంచామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఆటగాళ్లకు ప్రోత్సాహాకాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.