News July 22, 2024
చంద్రబాబు భయపడుతున్నారు: YS జగన్

AP: కేవలం 50 రోజుల్లోనే ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని జగన్ ట్వీట్ చేశారు. ‘ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఒకే పార్టీ ఉంది. కాబట్టి ఆ పార్టీనే ప్రతిపక్షంగా, ఆ పార్టీ నాయకుడినే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. కానీ ఆ పని చేస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం. మైక్ ఇస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగడతామని భయం. అందుకే ప్రతిపక్ష పార్టీని, నాయకుడిని గుర్తించడం లేదు’ అని విమర్శించారు.
Similar News
News February 12, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 12, 2026
భారత్‌లో రషీద్ ఖాన్ రికార్డు

భారత్ వేదికగా జరిగిన అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అఫ్గానిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ నిలిచారు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో చాహల్(49), అక్షర్(48), అర్ష్‌దీప్(43), హార్దిక్ పాండ్య(38), బుమ్రా(36), భువనేశ్వర్(34), వరుణ్(34) ఉన్నారు. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో రషీద్ ఖాన్ 113 మ్యాచుల్లో 190 వికెట్లు తీశారు.
News February 12, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 12, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


