News November 2, 2024
సంతానం విషయంలో చంద్రబాబు కరెక్ట్: అసదుద్దీన్

TG: ఎక్కువ మంది సంతానం ఉండాలని AP, TN CMలు చంద్రబాబు, స్టాలిన్ అంటున్నారని, కానీ అదే విషయాన్ని తానంటే రాద్ధాంతం చేసేవారని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ‘దక్షిణాదిలో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారు. ఒక వేళ జనాభా ప్రకారం నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి ఎంతో నష్టం కలుగుతుంది. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్

విశాఖకు పర్యాటక రంగంలో తలమానికంగా కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి నిర్మించిన విషయం తెలిసిందే. దీనిని ఎప్పుడు ప్రారంభిస్తారా? అని నగర ప్రజలతో పాటు పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. ఈనెల 30 లేదా డిసెంబర్ 1న అధికారికంగా దీనిని ప్రారంభించనున్నారు. విశాఖ ఎంపీ భరత్ చేతుల మీదుగా ఓపెన్ చేస్తారని సమాచారం.
News November 25, 2025
పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?

తెల్లగా కనిపించే పాలిష్ రైస్ తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత B1 అందక బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్2 డయాబెటిస్ రావచ్చు. ఫైబర్ తక్కువగా ఉండడంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందక కీళ్ల నొప్పులు వస్తాయి.
News November 25, 2025
CCRHలో 90 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH )లో 90 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. రీసెర్చ్ ఆఫీసర్, Jr లైబ్రేరియన్, MLT, LDC, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, B.Lisc, ఇంటర్, టెన్త్, BSc(నర్సింగ్), MSc, MS, MD, DMLT, MLT ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: ccrhindia.ayush.gov.in


