News September 20, 2024

చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: జగన్

image

AP: తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ‘ముంబై నటి కేసు, IPSల సస్పెన్షన్, మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటనలతో డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెచ్చారు. విజయవాడ వరదలపై ముందస్తు చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వంపై విమర్శలు వస్తుంటే బ్యారేజీ గేట్ల వద్దకు బోట్లు వదిలారని అంటున్నారు. ఇప్పుడు తిరుమల నెయ్యి అంశాన్ని తెరపైకి తెచ్చారు’ అని ఫైర్ అయ్యారు.

Similar News

News April 1, 2026

భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

image

ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19కేజీల సిలిండర్‌పై రూ.195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గతనెల దీనిపై రూ.115 పెంచిన విషయం తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడటంతో ధర పెరుగుతోంది.

News April 1, 2026

రేషన్ కార్డులు ఉన్నవారికి భారీ శుభవార్త

image

దేశవ్యాప్తంగా నేటి నుంచి రేషన్ షాపుల్లో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 18 కేజీల బియ్యం ఇస్తారు. అంత్యోదయ కార్డులు ఉన్నవారికి నెలకు 35 కేజీల చొప్పున 105 కిలోల రేషన్ అందుతుంది. గత వర్షాకాలంలోనూ ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్‌ను పంపిణీ చేశారు.

News April 1, 2026

కస్టమర్లకు ఈరోజు బ్యాంక్ సేవలు దూరం

image

తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు ఈరోజు బ్రాంచ్ సేవలను నిలిపివేశాయి. ఆర్థిక సంవత్సర ముగింపునకు సంబంధించిన పనులను పూర్తి చేయాల్సిన నేపథ్యంలో కస్టమర్లకు ఈరోజు బ్యాంకులు అందుబాటులో ఉండవు. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు వంటి సేవలు కొనసాగుతాయి. రేపు యథావిధిగా బ్యాంకులు కొనసాగనుండగా గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎల్లుండి మళ్లీ సెలవు ఉంటుంది.