News May 18, 2024

అల్లర్లకు చంద్రబాబే బాధ్యుడు: జోగి

image

AP: ఓటమి భయంతోనే వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. ‘ఎన్నికలు ముగిసినా వైసీపీ నేతలపై దాడులు ఆగటం లేదు. ప్రణాళికా బద్ధంగా మా పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారు. అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటూ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారు. అల్లర్లు, దాడులకు చంద్రబాబే బాధ్యుడు. ఫలితాల తర్వాత బాబు పారిపోవటం ఖాయం’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News September 17, 2025

ఆసియా కప్: గంట సమయం కోరిన పాక్!

image

అవసరమైతే ఆసియా కప్‌ను బహిష్కరిస్తామన్న పాక్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. మ్యాచ్ ప్రారంభ సమయాన్ని గంట పొడిగించాలని పీసీబీ కోరినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఇంకా హోటల్ నుంచి బయల్దేరని ఆటగాళ్లు చేరుకునేందుకే అడిగి ఉండొచ్చని సమాచారం. కాగా భారత్‌తో హ్యాండ్ షేక్ వివాదంతో మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని, లేదంటే మిగతా మ్యాచులు ఆడమని PCB ప్రకటించింది. కానీ ఈ డిమాండ్‌ను ICC తిరస్కరించింది.

News September 17, 2025

IFSCAలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

image

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(<>IFSCA<<>>) 20 ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫేజ్1, ఫేజ్ 2 రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫేజ్1 పరీక్ష అక్టోబర్ 11న, ఫేజ్ 2 పరీక్ష నవంబర్ 15న నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://ifsca.gov.in/Career

News September 17, 2025

ఈ నెల 23 నుంచి ఓటీటీలోకి ‘సుందరకాండ’

image

నారా రోహిత్, శ్రీదేవి, వర్తి వాఘని ప్రధాన పాత్రల్లో నటించిన ‘సుందరకాండ’ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 23 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రం గత నెల 27న థియేటర్లలో రిలీజైంది.