News November 27, 2024

BJP ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్

image

AP: ఆర్టీపీపీ బూడిద తరలింపు వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని హితవు పలికారు. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కల్పిస్తే సహించను. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి. ఈ విషయంలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలి’ అని ఆయన ఆదేశించారు.

Similar News

News November 25, 2025

అంత్యక్రియల తర్వాత స్నానం ఎందుకు చేస్తారు?

image

అంత్యక్రియలు పూర్తయ్యాక అక్కడికి వెళ్లిన వాళ్లందరూ స్నానం చేస్తారు. లేకపోతే ఆత్మలు దేహంలోకి ప్రవేశిస్తాయని నమ్ముతుంటారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. దహన సంస్కారాల సమయంలో ఆ దేహం నుంచి వచ్చే బ్యాక్టీరియా, అంటువ్యాధులు మనక్కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ అంటురోగాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, కచ్చితంగా స్నానం చేయాలి. అప్పట్లో నదులే స్నానానికి ప్రధాన వనరులు కాబట్టి అక్కడే స్నానమాచరించేవారు.

News November 25, 2025

వినూత్న నిరసన.. ఉల్లిగడ్డలకు అంత్యక్రియలు

image

మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు తగ్గడంపై రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మాండ్సౌర్ జిల్లాలోని ధమ్నార్‌లో ఉల్లిగడ్డలను పాడెపై పేర్చి అంత్యక్రియలు చేశారు. దేశంలో అత్యధికంగా ఉల్లి సాగు చేసే ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న మాల్వా-నిమర్‌లో కేజీ రూపాయి పలుకుతున్నట్లు వాపోయారు. పండించేందుకు రూ.10-12 ఖర్చు అవుతుందని, ధరలు తగ్గడంతో నష్టాలే మిగులుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

News November 25, 2025

ఉద్యాన పంటలతోనే సీమ అభివృద్ధి: పయ్యావుల

image

AP: రాయలసీమలో రైతుల ఆదాయం పెరగాలంటే అది ఉద్యాన పంటలతోనే సాధ్యమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సీమలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు హార్టికల్చర్ సాగు విస్తీర్ణం పెరగాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు. సీమలో సంపద సృష్టి, సిరి సంపదల వృద్ధి ఉద్యాన పంటలతో సాధ్యమవుతుందని, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుంటూ హార్టికల్చర్‌పై దృష్టి పెట్టాలన్నారు.