News August 9, 2024
MLC అభ్యర్థి ఎంపికపై చంద్రబాబు కసరత్తు

AP: ఉమ్మడి విశాఖ MLC ఉపఎన్నికపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో విశాఖ జిల్లా నేతలతో ఆయన సమావేశం అయ్యారు. కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిని బరిలో దింపాలని నిర్ణయించారు. ప్రస్తుత భేటీలో MLC అభ్యర్థిని చంద్రబాబు ఖరారు చేయనున్నారు. పీలా గోవింద్, గండి బాబ్జిల్లో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. కాగా వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును జగన్ ఖరారు చేశారు.
Similar News
News September 18, 2025
పాక్-సౌదీ మధ్య ఉమ్మడి రక్షణ ఒప్పందం

పాకిస్థాన్-సౌదీ అరేబియా దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు వ్యూహాత్మక ఉమ్మడి రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ ప్రకారం ఏ ఒక్క దేశంపై దురాక్రమణ జరిగినా దానిని ఇరు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కార్యాలయం చెప్పినట్లు డాన్ న్యూస్ పేపర్ పేర్కొంది. డిఫెన్స్ సపోర్ట్‌ను మెరుగు పరచుకోవడానికి ఈ ఒప్పందం దోహద పడుతుందని ఆ దేశాలు ఆకాంక్షించాయి.
News September 18, 2025
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న శంకర్ తనయుడు!

తమిళ డైరెక్టర్ శంకర్ తనయుడు ఆర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్యాషన్ స్టూడియోస్ నిర్మాణంలో అశోక్ అనే డెబ్యూ డైరెక్టర్‌తో ఆయన సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అర్జిత్ కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
News September 18, 2025
అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు తగ్గింపు

వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో తొలిసారి వడ్డీరేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో వడ్డీరేట్లు 4 శాతం నుంచి 4.5 శాతం రేంజ్‌కు చేరాయి. ద్రవ్యోల్భణం పెరుగుతున్నా.. జాబ్ మార్కెట్ మందగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.