News July 3, 2024

నేడు మోదీ, అమిత్ షాతో చంద్రబాబు భేటీ

image

AP: సీఎం చంద్రబాబు నేడు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల, జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హస్తినకు వెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు CM చంద్రబాబు వివరించనున్నారు. పారిశ్రామిక రాయితీలు, పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులివ్వాలని కోరనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ అవుతారు.

Similar News

News September 20, 2024

యూట్యూబ్‌: వీడియో పాస్ చేసినా యాడ్స్ వస్తాయి!

image

YouTubeలో ‘Pause Ads’ అనే ఫీచర్ రానుంది. దీని వల్ల యూజర్లు వీడియో పాస్ చేసినా స్క్రీన్‌పై సైడ్‌కు యాడ్స్ ప్లే అవుతాయి. ఇప్పటికే వీడియోలు చూసేటప్పుడు వస్తున్న యాడ్స్‌తో యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. తాజా ఫీచర్‌తో మరింత ఇబ్బంది పడే ఛాన్సుంది. యాడ్స్ వద్దనుకుంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడమే బెటర్ అని నెటిజన్లు అంటున్నారు. INDలో YouTube ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు ₹149 నుంచి స్టార్ట్ అవుతుంది.

News September 20, 2024

గ్రీస్‌లో ఇష్టమొచ్చినట్టు ఇళ్లు కొంటున్న ఇండియన్స్

image

జులై, ఆగస్టులో గ్రీస్‌లో భారతీయ ఇన్వెస్టర్ల ఇళ్ల కొనుగోళ్లు 37% పెరిగాయి. ఆ దేశ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ రూల్స్ మారడమే దీనికి కారణం. అక్కడ ఇల్లు కొంటే శాశ్వత నివాసం పొందొచ్చు. 2013లో మొదలైన ఈ ప్రోగ్రామ్‌లో మొదట రూ.2.2 కోట్లు పెట్టుబడి పెడితే చాలు. తక్కువ డబ్బే కాబట్టి ఏథెన్స్ వంటి నగరాల్లో భూముల రేట్లు కొండెక్కాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సెప్టెంబర్1 నుంచి పెట్టుబడిని రూ.7 కోట్లకు పెంచారు.

News September 20, 2024

సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్

image

భారత సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్‌కు గురైంది. ఇందులో అమెరికాకు చెందిన రిపిల్ అనే డిజిటల్ చెల్లింపుల సంస్థకు సంబంధించిన XRP, క్రిప్టో కరెన్సీ ప్రమోషన్ వీడియోలను హ్యాకర్లు పోస్టు చేశారు. కేసుల విచారణను ప్రసారం చేసేందుకు ఈ యూట్యూబ్ ఛానల్‌ను సుప్రీం కోర్టు వినియోగిస్తోంది.