News June 12, 2024

మంత్రులతో చంద్రబాబు భేటీ.. కాసేపట్లో శాఖలు ఖరారు

image

AP: ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. కేబినెట్‌లో చోటు కల్పించినందుకు CBNకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. మరి కాసేపట్లో మంత్రులకు శాఖలు ఖరారు కానున్నాయి. అటు పవన్ కళ్యాణ్‌కు ఏ శాఖ వస్తుంది? ఏపీ ఐటీ మంత్రి ఎవరనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

Similar News

News November 4, 2025

AP న్యూస్ అప్‌డేట్స్

image

✦ రైతులకు YCP ఏం చేసిందో అసెంబ్లీలో చర్చిద్దామా? జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్
✦ నకిలీ మద్యం కేసులో ఏడుగురిని కస్టడీకి ఇచ్చిన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు.. ఈ నెల 7 నుంచి 11 వరకు నిందితులను ప్రశ్నించనున్న పోలీసులు
✦ మద్యం కేసు నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 7కు వాయిదా వేసిన విజయవాడ ACB కోర్టు.. కౌంటర్ వేయాలని సిట్‌కు ఆదేశం

News November 4, 2025

పాక్ ప్లేయర్ హరీస్ రవూఫ్‌పై ఐసీసీ వేటు

image

ఆసియా కప్‌లో కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన ఆటగాళ్లపై ICC చర్యలు తీసుకుంది. పాక్ ప్లేయర్‌ హరీస్ రవూఫ్‌పై 2 మ్యాచుల బ్యాన్ విధించింది. 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్లు తెచ్చుకున్నందుకు ఈ వేటు వేసింది. 2 మ్యాచుల్లో 30% చొప్పున ఫీజులో కోత పెట్టింది. మరో ఆటగాడు ఫర్హాన్‌కు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. ఇక <<17831364>>సూర్య<<>>కు మ్యాచ్ (14వ తేదీ) ఫీజులో 30% కోత, 2 డీమెరిట్ పాయింట్లను విధించింది.

News November 4, 2025

వృద్ధాప్యంలో ఆదుకొనేలా కేరళలో ‘టైమ్ బ్యాంకు’

image

వృద్ధాప్యంలో ఆదుకొనేలా కేరళలోని కొట్టాయం(D) ఎలికుళం పంచాయతీ ‘టైమ్ బ్యాంక్’ అనే పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ముందుగా యువత అక్కడి ఆఫీసులో నమోదవ్వాలి. స్థానిక వృద్ధులకు తోడుగా ఉంటూ సాయం చేయాలి. వారు సేవ చేసిన సమయం ఆ టైమ్ బ్యాంకులో జమ అవుతుంది. వారికి అవసరమైనప్పుడు ఆ పాయింట్ల ద్వారా సేవలు పొందొచ్చు. వలసలతో వృద్ధులు ఒంటరి వారవుతుండడంతో జపాన్ స్ఫూర్తితో దీన్ని అనుసరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.