News May 7, 2025

రాయలసీమ అభివృద్ధిపై PMతో చంద్రబాబు ప్రత్యేక చర్చ

image

AP: PM మోదీతో ఢిల్లీలో గంటన్నర పాటు భేటీ అయిన CM చంద్రబాబు ప్రత్యేకంగా రాయలసీమ అభివృద్ధిపై చర్చించినట్లు తెలుస్తోంది. సీమలో పారిశ్రామిక కారిడార్, డ్రోన్ సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరినట్లు సమాచారం. అలాగే, ఆటోమొబైల్, ఏవియేషన్, డిఫెన్స్ కారిడర్ల ఏర్పాటుకూ సహకారం కోరినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఇదే సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ సమస్యలనూ ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు.

Similar News

News August 10, 2025

రేపు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

image

AP: దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

News August 10, 2025

టాలీవుడ్‌లో స్టైల్ ఐకాన్స్ వారే: సాయి‌ధరమ్ తేజ్

image

టాలీవుడ్‌లో మోస్ట్ స్టైల్ ఐకాన్ రామ్ చరణ్ అని మెగా హీరో సాయి‌ధరమ్ తేజ్(SDT) చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా మరో స్టైలిష్ యాక్టర్ అని తెలిపారు. నిన్న జరిగిన ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 వేడుకలో మోస్ట్ డిజైరబుల్(మేల్) అవార్డును SDT సొంతం చేసుకున్నారు. అవార్డును తన తల్లికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆరెంజ్ మూవీలో RC లుక్స్ తన ఆల్‌టైం ఫేవరెట్ అని పేర్కొన్నారు.

News August 10, 2025

హోరాహోరీ ఫైట్.. ఇద్దరు బాక్సర్లు మృతి

image

జపాన్‌ బాక్సింగ్ ఈవెంట్లో తీవ్ర విషాదం నెలకొంది. టోక్యో కొరాకువెన్ హాల్ పోటీల్లో ఇద్దరు యువ బాక్సర్లు గాయాలపాలై మృతిచెందారు. ఈనెల 2న షిగెటోషీ కొటారీ(28) 12 రౌండ్ల హోరాహోరీ ఫైట్ తర్వాత రింగ్‌లోనే కుప్పకూలిపోయారు. తర్వాతి రోజు మరో మ్యాచ్‌లో హిరోమాసా ఉరకావా(28) ఫైనల్ రౌండ్లో నాకౌట్ అయ్యారు. వీరిద్దరూ బ్రెయిన్ ఇంజూరీస్‌తోనే మరణించడం గమనార్హం. ఈ విషయాన్ని వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఇవాళ వెల్లడించింది.