News August 24, 2025
చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు: సుదర్శన్ రెడ్డి

దేశంలోని అత్యున్నత నాయకులలో AP CM చంద్రబాబు ఒకరని ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ‘చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు. గతంలో దేశ రాజకీయాలను అనేక సార్లు మలుపు తిప్పారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ ఎన్నికలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా తమ సపోర్ట్ NDA అభ్యర్థికేనని <<17485159>>CBN<<>> ఇప్పటికే స్పష్టం చేశారు.
Similar News
News August 24, 2025
HMS గౌరవ అధ్యక్షురాలిగా కవిత?

TG: MLC కవిత హిందూ మజ్దూర్ సభ గౌరవ అధ్యక్షురాలిగా నియమితులయ్యే అవకాశం ఉంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి(TBGKS)గా ఆమె అందించిన సేవలకు గుర్తుగా HMS అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని సంఘం నాయకులు నిర్ణయించారు. AUG 31న మంచిర్యాల(D) శ్రీరాంపూర్‌లో జరిగే సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఇటీవలే TBGKS అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను తొలగించి, కొప్పుల ఈశ్వర్‌ను ఎన్నుకున్నారు.
News August 24, 2025
పవన్ కళ్యాణ్ OG నుంచి అప్‌డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనుంది. ‘తుఫాన్ ఆగిపోయింది.. ఇప్పుడు గాలి వీస్తోంది’ అంటూ సెకండ్ సింగిల్‌పై అంచనాలు పెంచేసింది. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా, DVV దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.
News August 24, 2025
ఇవాళ, రేపు వెబ్ ఆప్షన్లకు అవకాశం

TG: డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్ల కోసం నిర్వహించే దోస్త్ ఫేజ్-2 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 24, 25న వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంది. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా ఒక కాలేజీలో సీటు పొందిన విద్యార్థి, అదే కాలేజీలో మరో బ్రాంచిలో సీటు ఖాళీగా ఉంటే మార్చుకోవచ్చు. మరో కాలేజీలో అలాంటి అవకాశం ఉండదు.