News March 5, 2025
అమిత్‌షాతో చంద్రబాబు భేటీ

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీతో సమావేశం అవుతారు. ఆ తర్వాత ఆయన ఓ వివాహ వేడుకకు హాజరై విశాఖకు పయనం కానున్నారు.
Similar News
News April 10, 2026
ఇండక్షన్ స్టవ్స్‌కు డిమాండ్.. కేంద్రం చర్యలు!

గ్యాస్ కొరత కారణంగా దేశంలో ఇండక్షన్ స్టవ్స్ వాడకం పెరుగుతోంది. రాబోయే రోజుల్లో 40% డిమాండ్ పెరగొచ్చని, అందుకు అదనంగా 27GW విద్యుత్ అవసరం పడుతుందని భావిస్తోంది. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలని ఇండక్షన్ స్టవ్ కంపెనీలతో చర్చిస్తోంది. అలాగే విద్యుదుత్పత్తి విషయంలోనూ చర్యలకు సిద్ధమవుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో LPG కొరత ఏర్పడటంతో ప్రజలు భారీగా ఇండక్షన్ స్టవ్‌లు కొంటున్నారు.
News April 10, 2026
భారీగా పెరగనున్న భూముల మార్కెట్ విలువ!

TG: త్వరలో భూముల మార్కెట్ విలువ భారీగా పెరగనుంది. 20% పెంచాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ తాజాగా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిపై క్యాబినెట్‌లో చర్చించి సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఆదాయ మార్గాలను పెంచేందుకు ఈ దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక HMDA ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల విక్రయానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని భావిస్తోంది.
News April 10, 2026
యూత్‌లో గుండె జబ్బులు.. భారంగా మారుతున్న ఇన్సూరెన్స్!

గతంలో 50 ఏళ్లు దాటాక వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు 20 ఏళ్లకే వస్తున్నాయి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలు రిస్క్ ఎక్కువని భావించి ప్రీమియం ధరలను 50% వరకు పెంచే యోచనలో ఉన్నట్లు ప్లమ్ సంస్థ డేటా వెల్లడించింది. అంటే గతంలో కంటే ఇప్పుడు పాలసీ కోసం ఎక్కువ డబ్బులు కట్టాలి. అందుకే సరైన టైమ్‌లో ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఆస్పత్రి ఖర్చులన్నీ సొంతంగా భరించాల్సి వస్తుందంటున్నారు.


