News December 25, 2024

అమిత్ షా, నిర్మలతో చంద్రబాబు భేటీ

image

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయిన ఆయన కాసేపటి క్రితం కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఇవాళ్టితో బాబు హస్తిన టూర్‌ ముగిసింది. రేపు ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడ జరిగే మంత్రి టీజీ భరత్ కూతురు వివాహానికి హాజరవుతారు.

Similar News

News October 25, 2025

SBI క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాడ్‌న్యూస్

image

క్రెడిట్ కార్డు పేమెంట్లపై ఛార్జీల పెంపునకు SBI సిద్ధమైంది. వీటి ద్వారా వాలెట్లలో రూ.1000 కంటే ఎక్కువ మనీ లోడ్ చేస్తే 1% ఛార్జీ పడనుంది. ఎడ్యుకేషన్ ఫీజులను థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లించినా 1% రుసుము విధించనుంది. అయితే స్కూల్, కాలేజ్ లేదా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్లు, POS మెషీన్ల ద్వారా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీ ఉండదు. పెంచిన ఛార్జీలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

News October 25, 2025

ఇంజినీరింగ్ అర్హతతో NHIDCLలో 34 పోస్టులు

image

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NHIDCL)లో 34 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీటెక్/బీఈ, గేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 34ఏళ్లు. వెబ్‌సైట్: https://www.nhidcl.com/

News October 25, 2025

ఇంటర్లో ఇంటర్నల్ విధానంతో మరిన్ని సమస్యలు: GJLA

image

TG: INTERలో 20% ఇంటర్నల్, 80% ఎక్స్‌టర్నల్ మార్కుల విధానం వల్ల ప్రమాణాలు పడిపోతాయని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ వల్ల ప్రాక్టికల్స్ ప్రహసనంగా మారాయి. ఇంటర్నల్ మార్కుల విధానం పెడితే ఆ సంస్థలు ఇష్టానుసారం ప్రవర్తిస్తాయి. ప్రమాణాలు మరింత దిగజారుతాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి’ అని సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.