News December 25, 2024
ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకునే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి పనులపై చర్చిస్తారని సమాచారం. కాగా ఇంతకుముందే కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే.
Similar News
News December 26, 2024
నాన్నకు క్యాన్సర్ సర్జరీ సక్సెస్: శివరాజ్ కూతురు నివేదిత
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్కు USలో క్యాన్సర్ సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిన్న కుమార్తె నివేదిత ఇన్స్టాలో వెల్లడించారు. ‘ఈ కష్టకాలంలో నాన్న చూపిన స్థైర్యం మాలో ధైర్యాన్ని నింపింది. అభిమానులు, ఫ్రెండ్స్ ప్రేమ, ప్రార్థనలు, ఆశీర్వాదాలు మాకెంతో బలాన్ని ఇచ్చాయి. వారికి మా ధన్యవాదాలు. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తాం’ అని పోస్టు చేశారు.
News December 26, 2024
టాస్ గెలిచిన ఆసీస్.. భారత జట్టులో కీలక మార్పులు
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. గిల్ స్థానంలో సుందర్ భారత జట్టులోకి వచ్చారు. రోహిత్ మళ్లీ ఓపెనింగ్ చేయనున్నారు.
IND: జైస్వాల్, రోహిత్, రాహుల్, కోహ్లీ, పంత్, జడేజా, నితీశ్, సుందర్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్
AUS: ఖవాజా, కోన్ట్సస్, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, క్యారీ, స్టార్క్, కమిన్స్, లయన్, బోలాండ్
News December 26, 2024
సూపర్ ఏజ్డ్ ద.కొరియా.. 20 శాతం వృద్ధులే
సంతానోత్పత్తి భారీగా తగ్గిపోవడంతో దక్షిణ కొరియా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశ మొత్తం జనాభా 5.1 కోట్లుకాగా 65 ఏళ్లు పైబడిన వారు 1.24 కోట్ల మంది(20%) ఉన్నారు. అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు వృద్ధులే. ఈ క్రమంలోనే ద.కొరియా ‘సూపర్ ఏజ్డ్ సొసైటీ’గా మారింది. ఐరాస ప్రకారం 7% కంటే ఎక్కువ వృద్ధ జనాభా ఉంటే ఏజింగ్ సొసైటీ, 14% పైన ఉంటే ఏజ్డ్ సొసైటీ, 20% కంటే ఎక్కువ ఉంటే సూపర్ ఏజ్డ్ సొసైటీగా పేర్కొంటారు.