News February 14, 2025

నేడు పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, నామినేటెడ్ పదవులపై కూడా చర్చిస్తారని సమాచారం.

Similar News

News January 21, 2026

SRPT: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్ తేజస్

image

లైసెన్స్‌డ్ సర్వేయర్లు క్షేత్రస్థాయిలో రైతులకు అపారమైన నమ్మకం కలిగేలా పనిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో 45 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ సర్వేయర్లతో ఆయన సమావేశమయ్యారు. ధరణి, ఎల్‌ఆర్‌పీ సమస్యలకు నూతన నైపుణ్యంతో కచ్చితమైన కొలతలు వేసి, నివేదికలు అందించాలని సూచించారు. భూ రికార్డుల నిర్వహణలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని కోరారు.

News January 21, 2026

గుండెపోటుతో నటుడు మృతి

image

మలయాళ నటి ఊర్వశి సోదరుడు, నటుడు కమల్ రాయ్(54) కన్నుమూశారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో మరణించారు. తమిళ్ సినిమా ‘పుతుస పడికిరెన్ పాటు’ సినిమాతో హీరోగా పరిచయమైన కమల్ 30 చిత్రాల్లో నటించారు. ఇందులో సాయుజ్యం, మంజు, కింగిని, వచలమ్, శోభనం, ది కింగ్ మేకర్, లీడర్ తదితర సినిమాలున్నాయి. ఆయన సోదరి ఊర్వశి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మొత్తం 350 చిత్రాల్లో నటించారు.

News January 21, 2026

ఆరావళి అక్రమ మైనింగ్.. కోలుకోలేని నష్టమన్న SC

image

ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్‌పై రివ్యూ చేసేందుకు ఎక్స్‌పర్ట్ కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అక్రమ మైనింగ్ కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. కమిటీ కోసం పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల పేర్లను 4 వారాల్లోగా ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. నిపుణుల కమిటీ తమ పర్యవేక్షణలో పనిచేస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్తగా మైనింగ్ లీజులను మంజూరు చేయడాన్ని నిషేధించింది.