News August 5, 2025

ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు త్వరలో రివ్యూ

image

AP: TDP MLAల పనితీరుపై పార్టీ చీఫ్ చంద్రబాబు త్వరలో రివ్యూ చేయనున్నారు. IVRS కాల్స్, ఇంటెలిజెన్స్, పార్టీ చేసిన 2సర్వేల రిపోర్టు ఆధారంగా ఈ రివ్యూ ఉంటుందని విశ్వసనీయ వర్గాలు Way2Newsకు తెలిపాయి. ఓవరాల్ రిపోర్టులో రెడ్ జోన్‌లోని టాప్-20లో ఇప్పటికే కొందరితో రివ్యూ జరిగింది. త్వరలోనే మిగతా నేతలతో సమీక్షలు జరుపుతారని సమాచారం. ఇంప్రూవ్‌మెంట్ కోసం 3నెలలు టైం ఇచ్చి మారకుంటే చర్యలు తీసుకునే అవకాశముంది.

Similar News

News August 5, 2025

డా.నమ్రత కేసులో సంచలన విషయాలు

image

TG: ‘సృష్టి’ ఫేక్ సరోగసీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీ మోసాలపై పోలీసులు ఆరా తీశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాతో డా.నమ్రతకు సంబంధాలున్నట్లు గుర్తించారు. ఏజెంట్ల సాయంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్లు తేల్చారు. అస్సాం, బిహార్, ముంబై, రాజస్థాన్ నుంచి చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 80 ఫేక్ సరోగసీ కేసులు చేశామని నమ్రత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

News August 5, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సముద్రమట్టానికి 1.5కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే ఆస్కారం ఉన్నందున చెట్ల కింద నిలబడరాదని సూచించింది.

News August 5, 2025

సినీ కార్మికుల సమ్మెను తప్పుబట్టిన విశ్వప్రసాద్

image

టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘స్కిల్ లేకుండా జీతాలు పెంచి ఇవ్వడం నిర్మాతలకు తలకు మించిన భారమే. కొన్ని క్రాఫ్ట్స్ వాళ్లు రోజుకు గంట పనిచేసినా ఫుల్ వేతనం ఇస్తున్నాం. స్కిల్స్ ఉన్నప్పటికీ యూనియన్ మెంబర్స్ కాకపోవడంతో ముంబై నుంచి అధికంగా చెల్లించి తీసుకొస్తున్నాం. ఈ సిస్టమ్‌ మార్చాలి. నచ్చిన వాళ్లతో పనిచేయించుకునే హక్కు మాకు ఉంది’ అని చెప్పారు.