News March 20, 2025
YSR పేరు వింటే చంద్రబాబుకు వణుకు: YCP

AP: దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ ఈ లోకాన్ని వీడి 16 ఏళ్లు అయినా, ఇప్పటికీ ఆయన పేరు వింటే సీఎం చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందని వైసీపీ ట్వీట్ చేసింది. ఆ భయంతోనే ఇప్పుడు విశాఖపట్నంలో వైఎస్‌ఆర్ గుర్తులను చెరిపేసేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారని ఆరోపించింది. విశాఖపట్నం స్టేడియానికి YSR పేరును తొలగించడంపై ఇవాళ ధర్నా చేస్తున్నట్లు వెల్లడించింది.
Similar News
News December 22, 2025
వైసీపీని పర్మినెంట్‌గా అధికారానికి దూరం చేస్తా: పవన్

AP: YCP నాయకులు బెదిరించడం మానుకోవాలని Dy.CM పవన్ హెచ్చరించారు. లేదంటే పర్మినెంట్‌గా అధికారంలోకి రాకుండా ఏం చేయాలో తెలుసన్నారు. మంగళగిరిలో నిర్వహించిన ‘పదవి-బాధ్యత’ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నాకు ఎవరూ శత్రువులు కాదు. వారి విధానాలతోనే సమస్య. ఆకురౌడీలను ప్రోత్సహించే పార్టీని గుర్తించను. విధానాలపై ప్రశ్నిస్తే స్వాగతిస్తా. తప్పదనుకుంటే ఆఖరి అస్త్రంగానే షర్ట్ మడతపెడతాం’ అని చెప్పారు.
News December 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 104 సమాధానం

ఈరోజు ప్రశ్న: ఓ నెల పురుషుడిగా, మరో నెల స్త్రీగా మారుతూ.. రెండు వంశాల ప్రతినిధిగా నిలిచిన వ్యక్తి ఎవరు?
సమాధానం: స్త్రీ, పురుషుడిగా మారుతూ సూర్య, చంద్ర వంశాలకు ప్రతినిధిగా నిలిచిన వ్యక్తి ‘ఇల’. ఈమె శివుని శాపంతో లింగ మార్పిడి చెంది చంద్రుని కుమారుడైన బుధుని వివాహమాడింది. వీరిద్దరికీ జన్మించిన పురూరవుడు చంద్రవంశ స్థాపకుడయ్యాడు. ఇలా సూర్యవంశంలో పుట్టి, చంద్రవంశ ఆవిర్భావంకు కారణమైంది. <<-se>>#Ithihasaluquiz<<>>
News December 22, 2025
స్కాలర్‌షిప్ బకాయిలు రూ.365.75 కోట్లు విడుదల

TG: బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలకు సంబంధించిన రూ.365.75 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఎస్సీ సంక్షేమ శాఖకు ₹191.63Cr, గిరిజన సంక్షేమ శాఖకు ₹152.59Cr, బీసీ సంక్షేమ శాఖకు ₹21.62Cr విడుదలయ్యాయి. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నీ పూర్తిగా విడుదల చేసినట్లు Dy.CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా విద్య విషయంలో రాజీ పడబోమన్నారు.


