News August 28, 2025
ఎల్లుండి కుప్పంలో చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 30న కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేపు సా.6 గంటలకు శాంతిపురం(మం) తుంసి చేరుకోనున్నారు. కడపల్లె స్వగృహంలో రేపు రాత్రి బస చేసి, ఎల్లుండి పరమసముద్రం గ్రామంలో హంద్రీ-నీవా కాలువకు గంగాహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం స్థానిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలతో అవగాహన ఒప్పందాల కార్యక్రమంలో పాల్గొంటారు.
Similar News
News August 29, 2025
విశాఖకు గూగుల్.. 25వేల మందికి ఉపాధి!

AP: గూగుల్ <<17545438>>విశాఖలో<<>> నెలకొల్పే డేటా సెంటర్ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, 50వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నట్లు అంచనా. ఆ సంస్థ సుమారు రూ.50వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. డేటా సెంటర్ కూలింగ్ కోసం అత్యధిక నీరు అవసరం పడుతుంది. అందుకే సముద్ర తీరం ఉన్న విశాఖను కంపెనీ ఎంచుకుంది. ప్రస్తుతం ముంబైలో ఉన్న డేటా సెంటర్ నుంచి సముద్ర మార్గంలో వైజాగ్‌కు కేబుల్స్ తీసుకురావడం కూడా సులువవుతుంది.
News August 29, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో సెలవు

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇవాళ కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్ తదితర జిల్లాల్లోనూ పాఠశాలలకు హాలిడే ఇవ్వాలనే వినతులు వినిపిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని IMD సూచించింది.
News August 29, 2025
నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ విశాఖపట్నం వేదికగా నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్, రెండో మ్యాచులో బెంగళూరు బుల్స్‌తో పుణెరి పల్టాన్ పోటీ పడతాయి. మొత్తం 12 జట్లు లీగ్ దశలో 108 మ్యాచులు ఆడతాయి. జైపూర్, చెన్నై, ఢిల్లీలోనూ మ్యాచులు జరగనున్నాయి. ఇంకా ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికలు ఖరారు కాలేదు. మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ 1/తెలుగు, జియో హాట్ స్టార్‌లో చూడవచ్చు.