News January 6, 2025

నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు నేటి నుంచి 2 రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. సోమవారం ద్రవిడ వర్సిటీలో ‘స్వర్ణ కుప్పం విజన్-2029’ డాక్యుమెంట్ విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే కుప్పం (M) నడిమూరులో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలెట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని తెలిపాయి. రేపు కుప్పం టీడీపీ ఆఫీసుకు వెళ్లనున్న చంద్రబాబు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు.

Similar News

News January 7, 2025

‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్ వచ్చేస్తోంది

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ సినిమా నిడివి మరింత పెరగనుంది. 20 నిమిషాల ఫుటేజీని కలిపి కొత్త వెర్షన్‌ను ఈనెల 11 నుంచి థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. రీలోడెడ్ వెర్షన్ రాబోతోంది అంటూ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.1810 కోట్లు వసూలు చేయగా పండుగ సందర్భంగా హిందీ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News January 7, 2025

సంక్రాంతికి మరో 4 స్పెషల్ రైళ్లు

image

సంక్రాంతి రద్దీ దృష్ట్యా SCR మరో 4 స్పెషల్ రైళ్లను ప్రకటించింది. కాకినాడ టౌన్-వికారాబాద్, వికారాబాద్-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-చర్లపల్లి, చర్లపల్లి-కాకినాడ టౌన్ మధ్య ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. చర్లపల్లి-కాకినాడ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా, మిగతా రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా నడవనున్నాయి.

News January 7, 2025

వారిద్దరి కారణంగా KCR నష్టపోయారు: ఎంపీ అరవింద్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, MLC కవితపై BJP MP అరవింద్ విమర్శలు గుప్పించారు. మాజీ CM కేసీఆర్‌కు వారిద్దరూ నష్టం కలిగించారని ఆరోపించారు. ‘పదేళ్ల పాటు ఆ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంది. కొడుకు, కూతురిని అదుపులో పెట్టకపోతే కేసీఆర్ నష్టపోతారు. తప్పు చేసినవారికి శిక్ష తప్పదు. కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు. తాము ఇంకా సీఎం, మంత్రులం అనే భ్రమల నుంచి కేసీఆర్, కేటీఆర్ బయటికి రావాలి’ అని సూచించారు.