News June 10, 2024
ఉండవల్లికి చేరుకున్న చంద్రబాబు
AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు రాష్ట్రానికి చేరుకున్నారు. మోదీ ప్రమాణస్వీకారానికి ఢిల్లీ వెళ్లిన ఆయన కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని నివాసానికి వెళ్లారు. చంద్రబాబు ఇవాళ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేయనున్నారు. మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Similar News
News December 24, 2024
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి
AP: సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. పలు కారణాలతో చెల్లించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News December 24, 2024
భూమి గుండ్రంగా లేదని నిరూపించేందుకు రూ.31 లక్షలు ఖర్చు!
భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని ఎవరిని అడిగినా చెబుతారు. అయితే, ఇది అబద్ధం అంటూ ఓ యూట్యూబర్ సవాల్ విసిరాడు. భూమి ఫ్లాట్‌గా ఉందని నిరూపించేందుకు యూట్యూబర్ జెరన్ కాంపనెల్లా ఏకంగా రూ.31 లక్షలు ఖర్చు చేసి అంటార్కిటికాలో యాత్ర ప్రారంభించాడు. ఈ ట్రిప్ పూర్తయ్యేలోపు తన వాదన తప్పనే విషయాన్ని గ్రహించాడు. భూమి గుండ్రంగానే ఉందంటూ క్షమాపణలు చెప్పాడు.
News December 24, 2024
పెన్షన్లపై సీఎం కీలక ఆదేశాలు
APలో పెన్షన్లు తీసుకునే వారిలో పలువురు అనర్హులు ఉన్నారని CM చంద్రబాబు తెలిపారు. అర్హులకే పథకాలు, పెన్షన్లు ఇవ్వాలనేది తమ ఉద్దేశమని, ఇదే సమయంలో అనర్హులకు పెన్షన్లు ఇవ్వడం సరికాదన్నారు. అనర్హులను తొలగించేందుకు 3 నెలల్లోగా దివ్యాంగుల పెన్షన్లపై తనిఖీలు పూర్తి చేయాలన్నారు. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లు, అధికారులపై చర్యలు తప్పవన్నారు. అటు అర్హులైన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.