News June 7, 2024
రాష్ట్రంలో ఘర్షణలపై స్పందించిన చంద్రబాబు

AP: YCP కవ్వింపు చర్యలపై TDP క్యాడర్ సంయమనం పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఘర్షణల విషయంపై పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని TDP ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు. పోలీసులు సైతం శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
Similar News
News November 24, 2025
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోండిలా

బ్యాంకు ఖాతాల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను RBI ఉద్గం <
News November 24, 2025
రాష్ట్ర బ్యాంకుల్లో రూ.2,200 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్

TG: రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లోని 80 లక్షల ఖాతాల్లో రూ.2,200 కోట్ల అన్క్లెయిమ్డ్ సొమ్ము ఉన్నట్లు RBIకి సమర్పించిన నివేదికలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. SBIలోనే దాదాపు 21.62 లక్షల అకౌంట్లలో సుమారు రూ.590Cr ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ నిధులను ఖాతాదారులు లేదా వారి వారసులకు అందజేసేందుకు బ్యాంకులు ఈ ఏడాది DEC 31 వరకు ‘వారసుల వేట’ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి.
News November 24, 2025
సందీప్ వంగా డైరెక్షన్ టీమ్లో స్టార్ కిడ్స్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా పూజా కార్యక్రమం నిన్న జరిగిన విషయం తెలిసిందే. చిరంజీవి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ జరగగా, డైరెక్షన్ టీమ్ ఆయనతో ఫొటోలు దిగింది. ఆ ఫొటోలో హీరో రవితేజ కుమారుడు మహాదన్, డైరెక్టర్ త్రివిక్రమ్ తనయుడు రిషి కూడా ఉన్నారు. వీరిద్దరూ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.


