News July 5, 2024

చంద్రబాబు, రేవంత్ భేటీ.. ముహూర్తం ఫిక్స్

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీకి ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్‌లో ఇరువురు సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్‌లోని సంస్థల పంపిణీ, విద్యుత్ సంస్థలపై ప్రధానంగా చర్చ జరగనుంది.

Similar News

News November 8, 2025

జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ 5 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 16వరకు అప్లై చేసుకోవచ్చు. లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.1000. వెబ్‌సైట్: https://cujammu.ac.in/

News November 8, 2025

DANGER: ఇయర్‌ఫోన్లు అధికంగా వాడుతున్నారా?

image

శరీరంలో ఇయర్‌ఫోన్ భాగమైపోయిందా అన్నట్లు కొందరు ఉదయం నుంచి రాత్రి వరకూ దానిని వాడుతుంటారు.. అలా గత మూడేళ్లుగా రోజుకు 12గంటలు ఇయర్‌ఫోన్లు వాడిన ఓ యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. వినికిడి తగ్గిపోవడం, ‘టిన్’ శబ్దం వినిపించడంతో ఆమె ENT ఆస్పత్రికి వెళ్లగా చెవిలో పొర ఇన్‌ఫెక్ట్ అయి చీము చేరిందని వైద్యులు తెలిపారు. ఇయర్‌ఫోన్ అతి వినియోగం వినికిడి శక్తిని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.

News November 8, 2025

పెట్టుబడుల సాధనకు లోకేశ్ తీవ్ర కృషి: సీఎం చంద్రబాబు

image

AP: విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో CII సమ్మిట్ నిర్మాణాత్మకంగా జరుగుతుందని CM చంద్రబాబు చెప్పారు. పెట్టుబడుల సాధనకు మంత్రి లోకేశ్ తీవ్ర కృషి చేస్తున్నారని తెలిపారు. గడువులోపే క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో CM మాట్లాడుతూ ‘లోకేశ్ ఆదేశాలతో MLAల్లో కదలిక వచ్చి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం’ అని చెప్పారు.