News March 26, 2025

పాస్టర్ మృతిపై చంద్రబాబు విచారం.. విచారణకు ఆదేశం

image

AP: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ కన్నుమూశారు. అది హత్యేనని, ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తుండటంతో సీఎం స్పందించారు. ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 5, 2025

NRPT: వైద్య శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

నారాయణపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను, సిబ్బంది వివరాలను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో ఎన్సీడీ ప్రోగ్రాంపై సమీక్షించారు. వైద్య శాఖ పరిధిలోని కార్యక్రమాలను, టీకాలు, మందుల పంపిణీ వంటి వాటిని వంద శాతం పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.

News December 5, 2025

CM రేవంత్‌కు సోనియా అభినందన సందేశం

image

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్-2047 నాటికి రాష్ట్రం $1T ఆర్థికశక్తిగా ఎదగడంలో కీల‌కం కానుందని INC పార్ల‌మెంట‌రీ పార్టీ నేత సోనియా గాంధీ పేర్కొన్నారు. స‌మ్మిట్ నిర్వ‌హిస్తున్నందుకు CM రేవంత్ రెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు. సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కీల‌క‌ ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగ‌మయ్యే వారికి స‌మ్మిట్ మంచి వేదిక అని తన సందేశంలో పేర్కొన్నారు.

News December 5, 2025

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌.. సీఎంలకు మంత్రుల ఆహ్వానం

image

TG: ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వ్యాపారవేత్తలతో పాటు పలు రాష్ట్రాల CMలకూ మంత్రులు ఆహ్వానం పలుకుతున్నారు. ఇవాళ AP CM చంద్రబాబును కోమటిరెడ్డి, TN CM స్టాలిన్‌ను ఉత్తమ్, ఝార్ఖండ్ CM హేమంత్‌ను భట్టి ఆహ్వానించారు. ‘CBN సీనియర్ నాయకుడు. ఆయన సలహా తీసుకుంటాం. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి’ అని కోమటిరెడ్డి చెప్పారు.