News July 7, 2024
రేవంత్ ప్రతిపాదన.. సాధ్యం కాదన్న చంద్రబాబు

AP, TG రాష్ట్రాల ఎంపీలంతా కలిసి 2 రాష్ట్రాల సమస్యలపై కేంద్రం వద్దకు వెళ్తే బాగుంటుందని CM రేవంత్ సూచించారు. 2 రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నందున రాజకీయంగా అది సాధ్యం కాదని CBN బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయుల్లో కలిసి ప్రయత్నం చేయవచ్చని సూచించారు. అటు 2 రాష్ట్రాల అధికారుల కమిటీల మధ్య వీలైనన్ని సమావేశాలు తరచూ జరగాలని, సమస్యలు పరిష్కరించాలని ఇరువురూ నిర్ణయించారు.
Similar News
News January 8, 2026
రైళ్ల శుభ్రతపై భారీగా ఫిర్యాదులు

ట్రైన్లలో కోచ్ల శుభ్రత, బెడ్ రోల్స్కు సంబంధించి Rail Madad యాప్లో గత ఏడాది సెప్టెంబర్లో 8,758 ఫిర్యాదులు నమోదు కాగా, అక్టోబర్ (13,406), నవంబర్ (13,196)లో సుమారు 50% పెరుగుదల కనిపించింది. అదే సమయంలో ‘సంతృప్తికర’ ఫీడ్బ్యాక్లు కూడా తగ్గాయి. ఈ పరిస్థితిని గమనించిన రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోన్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు వేగంగా పరిష్కారమయ్యేలా చూడాలని సూచించింది.
News January 8, 2026
చిన్నారుల దత్తత.. అసలు విషయం చెప్పిన శ్రీలీల

నటి శ్రీలీల 2022లో గురు, శోభిత అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. దీనికి గల కారణాలను ‘పరాశక్తి’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించారు. చిన్న వయసులోనే పిల్లలను దత్తత తీసుకోవడానికి ప్రేరణ ఇచ్చింది ఒక దర్శకుడు అని తెలిపారు. “కన్నడలో ఓ సినిమా చేసేటప్పుడు ఆయన నన్ను అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడి పిల్లలు నాకు బాగా దగ్గరయ్యారు. ఇద్దరని దత్తత తీసుకున్నాను” అని చెప్పారు.
News January 8, 2026
గ్రోక్ వివాదం.. కేంద్రానికి ‘X’ నివేదిక

‘X’లో <<18744769>>అశ్లీల కంటెంట్<<>> అంశం కేంద్రానికి చేరిన విషయం తెలిసిందే. అలాంటి కంటెంట్ను తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. తాజాగా బుధవారం సాయంత్రానికి ఎక్స్ తన రిపోర్టును సమర్పించింది. దీనిని ఐటీ శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. Grokను దుర్వినియోగం చేసే యూజర్లపై కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే సదరు సంస్థ హెచ్చరించింది.


