News November 13, 2024
చంద్రబాబుకు అప్పు రత్న బిరుదు ఇవ్వాలి: జగన్

AP: చంద్రబాబు హయాంలో అప్పులు 19శాతం పెరిగితే, తాను సీఎంగా ఉన్న కాలంలో 15శాతం మాత్రమే పెరిగినట్లు YS జగన్ వెల్లడించారు. రూ.10 లక్షల కోట్లు, రూ.14లక్షల కోట్ల అప్పు అని తమపై తప్పుడు ప్రచారం చేసి, బడ్జెట్లో రూ.6లక్షల కోట్ల అప్పు మాత్రమే చూపించారని ఆరోపించారు. అంటే చంద్రబాబు, కూటమి నేతలు చేసిందంతా తప్పుడు ప్రచారం కాదా? అని ప్రశ్నించారు. అప్పు రత్న అనే బిరుదును చంద్రబాబుకు ఇవ్వాలని సెటైర్లు వేశారు.
Similar News
News December 4, 2025
డాలర్.. 12 లక్షల రియాల్స్!

ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఓ డాలర్ 12 లక్షల రియాల్స్‌కు సమానమైంది. ఫలితంగా నిత్యవసరాల ధరలు పెరిగాయి. అణ్వస్త్ర కార్యక్రమాల వల్ల ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది. అటు ఆ దేశంలో పవర్ గ్రిడ్ల వైఫల్యం వల్ల గంటలపాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు అల్లాడుతున్నారు. 2015లో ఓ డాలర్ 32 వేల రియాల్స్‌కు సమానంగా ఉండేది.
News December 4, 2025
‘విటమిన్ K’ రిచ్ ఫుడ్స్ ఇవే!

ఎముకలు, గుండె ఆరోగ్యానికి విటమిన్-K అవసరం. గాయాలైనప్పుడు అధిక రక్తస్రావాన్ని నివారించడానికి రక్తం గడ్డకట్టే ప్రోటీన్ల ఉత్పత్తిలో దీనిది కీలకపాత్ర. మహిళల్లో రుతుచక్రాన్ని నియంత్రించడంలోనూ సాయపడుతుంది. ఈ విటమిన్ ఉండే ఆహారాన్ని డైట్లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, కివీ, పుదీనా, క్యారెట్, అవకాడో, ద్రాక్ష, దానిమ్మ, గుమ్మడికాయ తదితరాల్లో ‘K’ విటమిన్ మెండుగా ఉంటుంది.
News December 4, 2025
ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటాం: పవన్

AP: కాకినాడ(D) ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటామని వారితో సమావేశం సందర్భంగా Dy.CM పవన్ అన్నారు. ‘సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన చేస్తాం. జాలర్ల ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా అయింది. చేసిన పనులే చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తెచ్చారు’ అని ఆరోపించారు.


