News July 20, 2024

శాంతిభద్రతలపై చంద్రబాబు దృష్టి సారించాలి: రామకృష్ణ

image

ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ప్రారంభించాలన్నారు. ‘చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్నా APలో శాంతిభద్రతలపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. పుంగనూరులో MP మిథున్ రెడ్డి ఉన్న ఇంటికి వెళ్లి దాడి చేయడం సరికాదు. CBN వీటిని సరిదిద్దాలి. పోలీసులు గతంలో చేసిన పనులనే మళ్లీ చేస్తున్నారు’ అని విమర్శించారు.

Similar News

News January 28, 2026

NeGDలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ e గవర్నెన్స్ డివిజన్(<>NeGD<<>>)లో 8 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్/బీఈ, ఎంసీఏ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. టెక్నికల్ లీడ్, ఫుల్ స్టాక్ డెవలపర్, AI/ML ఇంజినీర్, డేటా సైంటిస్ట్, డెవలప్‌మెంట్ ఆపరేషన్ ఇంజినీర్, టెస్టర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 55ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://dic.gov.in/

News January 28, 2026

IVF ప్రక్రియలో దశలివే..

image

IVFలో 5 కీలక దశలు ఉంటాయి. ఎగ్‌ స్టిమ్యులేషన్‌కు హార్మోన్ల ఇంజెక్షన్ చేసినప్పటి నుంచి.. బ్లడ్‌ టెస్ట్‌ చేయడానికి 9-14 రోజులు పడుతుంది, ఆ తర్వాత.. పిండం బదిలీ చేస్తారు. యావరేజ్‌గా IVF సైకిల్‌ కోసం 17- 20 రోజుల సమయం పడుతుంది. అయితే, పేషెంట్‌ కండీషన్‌ బట్టి.. సమయం మారుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా సంతానం పొందాలనుకునేవారు ప్రోటీన్లు, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి.

News January 28, 2026

భీష్మ ఏకాదశి ఎందుకు జరుపుకొంటారు?

image

మాఘ శుక్ల ఏకాదశి నాడే భీష్ముడు అంపశయ్యపై ఉండి, కృష్ణుని సమక్షంలో విష్ణు సహస్రనామాలు లోకానికి అందించి మోక్షం పొందారు. తన తండ్రి ద్వారా పొందిన ‘ఇచ్ఛా మృత్యువు’ వరంతో ఉత్తరాయణం వచ్చే వరకు వేచి చూసి, ఈ పవిత్ర తిథి నాడు ప్రాణాలు విడిచారు. అందుకే ఈరోజుని ‘భీష్మ ఏకాదశి’గా జరుపుకొంటారు. దీన్నే ‘జయ ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని నమ్మకం.