News April 25, 2024

ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చిన నీచుడు చంద్రబాబు: బొత్స

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ‘ఓటుకు నోటు కేసులో పారిపోయి ఇక్కడ తిరుగుతున్న నీచుడు చంద్రబాబు. రాజకీయాల్లో నేతల తలలపై రూపాయి పెట్టి విలువ కట్టడమే ఆయన బతుకు. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండటంతో సహనం కోల్పోయి సీఎం జగన్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారు’ అని ఫైరయ్యారు.

Similar News

News January 26, 2026

కొండెక్కిన వెండి ధర.. ఔన్స్‌కు $110!

image

అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఇవాళ <<18959429>>ఉదయం<<>> ఔన్స్‌కు $100 వద్ద ఉన్న ధర ప్రస్తుతం $110కి చేరింది. కేవలం నెల రోజుల్లోనే 54% పెరుగుదల నమోదు కాగా జనవరి 2025తో పోలిస్తే ఏకంగా 280% పెరిగిందని ట్రేడ్ నిపుణులు తెలిపారు. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో వెండి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు.

News January 26, 2026

PHOTO GALLERY: అమరావతిలో రిపబ్లిక్ డే

image

AP: రాజధాని అమరావతిలోని నేలపాడు పరేడ్ గ్రౌండ్‌లో తొలిసారి నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీసుల కవాతు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్వర్ణ పంచాయతీ- స్వచ్ఛ పంచాయతీ, స్వచ్ఛాంధ్ర, పర్యాటక, ఉద్యానవన శాఖ, అమరావతి‌, ఐటీ శకటాలు అబ్బురపరిచాయి.

News January 26, 2026

గోవిందాపై భార్య సునీత సంచలన కామెంట్స్

image

స్టార్ హీరో గోవిందాపై భార్య సునీతా అహుజా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన అఫైర్స్ రూమర్స్‌ను పరోక్షంగా కన్ఫర్మ్ చేసిన ఆమె 63 ఏళ్ల వయసులో ఇలాంటివి తగదని సూచించారు. పిల్లలు పెద్దవాళ్లయ్యారని.. వాళ్లు డిస్టర్బ్ అవుతారన్నారు. ‘హీరోయిన్ అవ్వలేని కొంతమంది అమ్మాయిలు స్టార్లను ట్రాప్ చేసి తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తారు. మరి మీ బుద్ధి ఏమైంది’ అంటూ గోవిందా పేరు ఎత్తకుండా ఆయన్ని ప్రశ్నించారు.