News June 20, 2024

నేడు అమరావతికి చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబునాయుడు నేడు అమరావతిలో పర్యటించనున్నారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. తర్వాత అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటిస్తారు. అధికారుల భవన సముదాయాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారు.

Similar News

News September 15, 2025

లిక్కర్ స్కాం: మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్

image

మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ ఇవాళ మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, బాలాజీకుమార్ యాదవ్, నవీన్ కృష్ణ ప్రమేయంపై వివరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. తాజాగా దాఖలు చేసిన రెండో అనుబంధ అభియోగపత్రంతో కలిపి ఇప్పటి వరకు సిట్ మొత్తం మూడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసినట్లయింది.

News September 15, 2025

కాలేజీలు యథావిధిగా నడపండి: సీఎం రేవంత్

image

TG: కాలేజీల బకాయిలు విడతల వారీగా చెల్లించేందుకు సానుకూలంగా ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని, కాలేజీలు యథావిధిగా నడిపించాలని యూనియన్ నాయకులను ఆయన కోరారు. కళాశాలల సమస్యలు, యాజమాన్యాలు చేస్తున్న డిమాండ్లపై సీఎంతో భట్టి, శ్రీధర్ బాబు భేటీ ముగిసింది. ఈ సాయంత్రం యూనియన్ నాయకులతో మంత్రులు చర్చించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

News September 15, 2025

రేపు భారత్-అమెరికా వాణిజ్య చర్చలు

image

భారత్, అమెరికా మధ్య రేపు వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ఇవాళ రాత్రి US చీఫ్ నెగోషియేటర్, ట్రంప్ సహాయకుడు బ్రెండన్ లించ్ భారత్ చేరుకోనున్నారు. ట్రేడ్ డీల్‌‌పై పరస్పరం చర్చలకు ఎదురుచూస్తున్నట్లు ట్రంప్‌తో పాటు ప్రధాని మోదీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.