News August 12, 2024
నేడు అమరావతికి చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ అమరావతి రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా అమరావతిలోని సచివాలయానికి వెళ్తారు. ఉదయం 11 గంటలకు ఆర్టీసీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతోపాటు వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
Similar News
News November 11, 2025
జూబ్లీహిల్స్లో BRS గెలుపు: మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో BRS పార్టీ గెలుస్తుందని ‘మిషన్ చాణక్య’ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. BRSకు 41.60%, కాంగ్రెస్కు 39.43%, BJPకి 18.97% ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. షేక్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లలో BRSకు, యూసుఫ్గూడ, రహమత్ నగర్ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తుందని తెలిపింది.
News November 11, 2025
నటి సాలీ కిర్క్ల్యాండ్ కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్ నటి సాలీ కిర్క్ల్యాండ్(84) కన్నుమూశారు. డిమెన్షియాతో బాధపడుతున్న ఆమె పలుమార్లు కింద పడటంతోపాటు ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల కారణంగా చికిత్స పొందుతూ చనిపోయారు. 1987లో Anna చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆమె ఆస్కార్కు నామినేట్ అయ్యారు. 1968లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాలీ 200కు పైగా చిత్రాలు, టెలివిజన్ సిరీస్లలో నటించారు. గోల్డెన్ గ్లోబ్ సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను సాధించారు.
News November 11, 2025
RBIలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

ఆర్బీఐలో 120 గ్రేడ్-B ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహించిన ఫేజ్-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. <


